ప్రపంచవ్యాప్తంగా "బింబిసార" సినిమా మూడు రోజుల్లో చేసిన కలెక్షన్లు.. ఎంతంటే?

Bimbisara 3 Days Worldwide Box Office Collections
x

ప్రపంచవ్యాప్తంగా "బింబిసార" సినిమా మూడు రోజుల్లో చేసిన కలెక్షన్లు.. ఎంతంటే?

Highlights

"బింబిసార" మూడు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి

Bimbisara Box Office Collections: ఈమధ్యనే "118", "ఎంత మంచి వాడవు రా" సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా ఇప్పుడు "బింబిసారా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సోషియో ఫాంటసీ జోనర్ లో విడుదలైన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ అత్యంత క్రూరమైన రాజు బింబిసార పాత్రలో కనిపించారు. అప్పట్లో త్రిగర్తల రాజ్యాన్ని పాలించిన బింబిసారుడు టైం ట్రావెల్ చేసి 2022 కి వస్తే ఏమవుతుంది అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరక్కించారు దర్శక నిర్మాతలు. కేథరిన్ తెరిసా మరియు సంయుక్త మీనన్లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

ఎన్ టీ ఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ సినిమా ని స్వయంగా నిర్మించారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమా కి సంగీతాన్ని అందించారు. విడుదలైన మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్లు అందుకుంటుంది ఈ సినిమా . ఈ సినిమా ధియేట్రికల్ బిజినెస్ 15 కోట్లకు జరిగింది. కానీ వారాంతం పూర్తికాకముందే సినిమా 17 కోట్ల ను కలెక్షన్లు నమోదు చేసుకొని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మధ్యనే డిస్ట్రిబ్యూటర్ లను సేఫ్ జోన్ లోకి తీసుకువెళ్లిన "బింబిసార" మూడు రోజుల కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉన్నాయి.

నైజాం: 5.6 కోట్లు

సీడెడ్: 3.41 కోట్లు

ఉత్తరాంధ్ర: 1.95 కోట్లు

గుంటూరు: 1.27 కోట్లు

ఈస్ట్ గోదావరి : 1.02 కోట్లు

వెస్ట్ గోదావరి : 0.74 కోట్లు

కృష్ణ : 0.88 కోట్లు

నెల్లూర్ : 0.49 కోట్లు

ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ: 15.36 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్: 2.2 కోట్లు

వరల్డ్ వైడ్: 17.56 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories