బిగ్ బాస్ టైమ్ మార్పు!

బిగ్ బాస్ టైమ్ మార్పు!
x
Highlights

రాత్రి ఏడూ గంటలకు కొత్తగా గుప్పెడంత మనసు అనే సీరియల్ ప్రసారం అవుతుండడంతో ఆ స్థానంలో వస్తున్న వదినమ్మ సీరియల్ ని రాత్రి 09: 30కి మార్చారు.

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 టైం మారింది. రోజూ రాత్రి తోమ్మిది గంటలకు వచ్చే ఈ షో డిసెంబ‌ర్ 7 నుంచి రాత్రి 10 గంటలకు రానుంది. రాత్రి ఏడూ గంటలకు కొత్తగా గుప్పెడంత మనసు అనే సీరియల్ ప్రసారం అవుతుండడంతో ఆ స్థానంలో వస్తున్న వదినమ్మ సీరియల్ ని రాత్రి 09: 30కి మార్చారు. దీనితో బిగ్ బాస్ షో టైంలో కుడా మార్పు వచ్చింది. ఇప్పటికే టైం మార్పు పైన ప్రోమోలు కూడా వచ్చాయి. ఇక శ‌ని, ఆదివారాల్లో మాత్రం ఎప్ప‌టిలాగే రాత్రి తొమ్మిన్న‌ర‌కు బిగ్‌బాస్ ప్రసారం కానుంది. ఇక అటు ఈ ఏడాది సీజ‌న్‌కు శుభం కార్డు వేసేందుకు ముచ్చ‌ట‌గా మూడు వారాలు సమయం మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ విజేతగా నిలించేందుకు ఫోకస్ పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories