సుజాత నవ్వు ఫేకా.. నిజామా?

Sujatha Interview with HMTV : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో ఇప్పటికి అరుగురు ఎలిమినేట్ అయ్యారు.

Krishna
Published on: 13 Oct 2020 8:18 PM IST
సుజాత నవ్వు ఫేకా.. నిజామా?
X

Sujatha Interview with HMTV : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో ఇప్పటికి అరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇందులో మొదటివారం ఎలిమినేషన్ లో సూర్యకిర‌ణ్ వెళ్ళగా, రెండోవారం కరాటే క‌ళ్యాణి, మూడోవారం దేవి నాగ‌వ‌ల్లి, నాలుగో వారం స్వాతి దీక్షిత్, అయిదోవారం సుజాత ఎలిమినేట్ అయ్యారు. అయితే ఎలిమినేషన్ లో గంగవ్వ లేకపోయినప్పటికీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెను హౌస్ నుంచి బయటకు వెళ్ళవలసి వచ్చింది. దీనితో మొత్తం ఆరుగురు సభ్యులు హౌస్ నుంచి వెళ్ళిపోయారు. ఇక ఇది ఇలా ఉంటే గతవారం ఎలిమినేట్ అయిన సుజాత HMTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇచ్చింది.

అయితే హౌస్ లో ఉన్నప్పుడు సుజాత నవ్వు ఫేక్ అని జేన్యున్ కాదని అంటూ కరాటే క‌ళ్యాణి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.. దీనిపైన సుజాత స్పందించింది. సహజంగానే తానూ ఎప్పుడు నవ్వుతూ ఉండేదానిని అని చెప్పుకొచ్చింది. కోపంగా ఉండేవాళ్ళు అన్న, ఏడవడం అన్న తనకి ఇష్టం లేదని వెల్లడించింది. ఇక హౌస్ లో ఉన్న సమయంలో తానూ కావాలని ఎప్పుడు నవ్వలేదని చెప్పుకొచ్చింది. అసలు హౌస్ లో కెమరా ఉన్న విషయం తానూ మార్చిపోయినట్టుగా సుజాత వెల్లడించింది. అటు హౌస్ లో ఉన్న ప్రతి రోజు చాలా ఆనందంగా ఉన్నట్టుగా సుజాత చెప్పుకొచ్చింది. ఇక ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి కూడా పాల్గొనడం విశేషం!



Krishna

Krishna

Next Story