Bigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో 'బిగ్‌బాస్‌' ప్రోమో.. అదిరిపోయిన..

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికి ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది.

Arun Chilukuri
Published on: 9 Aug 2022 3:30 PM IST
Bigg Boss Telugu Season 6 Promo Released
X

Bigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో ‘బిగ్‌బాస్‌’ ప్రోమో.. అదిరిపోయిన..

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికి ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, సన్నీ లు ఐదు బిగ్ బాస్ సీజన్ల విన్నర్స్ గా నిలిచారు. ఇక ఈ మధ్యనే ప్రసారమైన బిగ్ బాస్ ఓటీటీ లో నటి బిందు మాధవి మొట్టమొదటి బిగ్ బాస్ ఫిమేల్ విన్నర్గా నిలిచింది. ఇక ప్రేక్షకులందరూ బిగ్ బాస్ సీజన్ 6 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మధ్యనే నాగర్జున బిగ్ బాస్ సీజన్ 6 గురించి అధికారికంగా ప్రకటించి ఈ సీజన్లో కామన్ పీపుల్ కి కూడా చోటు ఉండబోతోంది అని క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా మరొక ప్రోమోతో అందరి ముందుకు వచ్చారు నాగార్జున. అప్పగింతల సమయంలో ఉన్నట్టుండి తల్లిదండ్రి మాయమైపోగా అప్పుడే నాగార్జున ఎంట్రీ ఇచ్చి అప్పగింతల అయ్యేవరకు ఆగలేకపోయారంటే అక్కడ ఆట మొదలైనట్టే అంటూ బిగ్ బాస్ సీజన్ 6 త్వరలోనే మొదలు కాబోతున్నట్లుగా ప్రకటించారు.

"ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్" అనే టాగ్ లైన్ తో బిగ్ బాస్ 6 త్వరలోనే మొదలు కాబోతోంది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ రెండవ సీజన్ కి నాని లు హోస్ట్ లు గా వ్యవహరించగా, మూడు నాలుగు ఐదు మరియు బిగ్ బాస్ ఓటీటీ లకు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. తాజాగా ఇప్పుడు ఐదవ సారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడు మొదలవుతోంది, ఎవరు ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా ఉండబోతున్నారు అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story