Bigg Boss 5 Promo: ఐస్ టాస్క్ తో మొదలైన బిగ్ బాస్ ఫైనల్ రేసు

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మంగళవారం(30/11/2021) ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 30 Nov 2021 3:17 PM IST
Bigg Boss Telugu Season 5 Tuesday Episode Promo Today 30th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 టికెట్ టూ ఫినాలే రేసు మొదలైంది. మంగళవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. టికెట్ టూ ఫినాలే రేసులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో గెలిచిన అయిదు మంది ఇంటి సభ్యులు ఫైనల్ రేసులో నిలువనున్నారు. అయితే తాజా ప్రోమో ప్రకారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మూడు రకాల ఛాలెంజ్ లను బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

టికెట్ టూ ఫినాలే టాస్క్ ముగిసే సమయానికి ఏ ఒక్క ఇంటి సభ్యుడు అయితే అందరికంటే ఎక్కువ పాయింట్స్ గెలుచుకుంటాడో ఆ ఇంటి సభ్యుడు ఈ టాస్క్ గెలిచి బిగ్ బాస్ సీజన్ 5 కి మొదటి ఫైనలిస్ట్ గా నిలుస్తాడని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. ఇక ఐస్ టాస్క్ లో భాగంగా ఛాలెంజ్ లో పాల్గొన్న పోటీదారులు ఓర్పుతో ఉండి తమ వద్ద ఉన్న బాల్స్ ని కాపాడుకోవాలని బిగ్ బాస్ నియమాన్ని ఉంచుతాడు. ఇక ఛాలెంజ్ లో విజె సన్నీ నవ్వుతూ, ఇంటి సభ్యులను నవ్విస్తూ ఐస్ టాస్క్ ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. మరి ఈ టాస్క్ లో గెలిచి బిగ్ బాస్ సీజన్ 5 టికెట్ టూ ఫినాలే కి ఎవరు ముందుగా ఎంపిక అవుతారో వేచిచూడాల్సిందే..!!


Sandeep Reddy

Sandeep Reddy

Next Story