Bigg Boss 5 Promo: తగ్గేదేలే..!! డైలాగ్స్ తో సన్నీ.. యాక్టింగ్ లో మానస్

* బిగ్ బాస్ సీజన్ 5 మంగళవారం ఎపిసోడ్ ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 7 Dec 2021 1:28 PM IST
Bigg Boss Telugu Season 5 Tuesday Episode Promo Today 07th December 2021 | Bigg Boss 5 Updates
X

బిగ్ బాస్ సీజన్ 5 (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మంగళవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. బిగ్ బాస్ ఇచ్చిన రోల్ ప్లే టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు వారికి ఎవరి ఇంటి సభ్యుడిదైతే రోల్ ఇచ్చారో వారిలా యాక్ట్ చేస్తూ మంగళవారం ఎపిసోడ్ లో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించనున్నారు. ఈ టాస్క్ లో భాగంగా మానస్.. ప్రియాంక సింగ్, సన్నీ.. మానస్ రోల్ లో యాక్టింగ్ చేస్తూ ఫుల్ ఫన్ జెనరేట్ చేసినట్టుగా ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.

ఇక శ్రీరామచంద్ర.. లోబోలా ఐ కేర్ జనాలు.. ఐ డోంట్ కేర్ జనాలు అంటూ లోబో డైలాగ్ చెప్పి ఇంటి సభ్యులను నవ్వించాడు. ప్రోమోలో చూసిన ప్రకారం సిరి హనుమంత్.. శ్రీరామ్ లా, శన్ముఖ్ జస్వంత్.. జెస్సీలా, కాజల్.. విజె సన్నీలా నటిస్తూ ఫర్వాలేదనిపించారు. మొత్తానికి తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం మంగళవారం ఎపిసోడ్ ఇంటి సభ్యుల సరదా డైలాగ్స్ తో పాటు ఫన్ యాక్టింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు..


Sandeep Reddy

Sandeep Reddy

Next Story