Bigg Boss 5 Highlights: అలకలో ఆడవాళ్ళు.. ఓదార్చే పనిలో మగవాళ్ళు

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గురువారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Published on: 19 Nov 2021 11:30 AM IST
Bigg Boss Telugu Season 5 Thursday Episode Highlights of 18th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 Highlights: అలకలో ఆడవాళ్ళు.. ఓదార్చే పనిలో మగవాళ్ళు

Bigg Boss Telugu Season 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గురువారం ఎపిసోడ్ లో భాగంగా కెప్టెన్సీ పోటీదారుల కోసం సూపర్ పవర్ తీసుకున్న కెప్టెన్ రవి.. ఆ పవర్ టూల్ ని విజే సన్నీకి ఇస్తానని బిగ్ బాస్ కి చెప్పాడు. అయితే ఆ పవర్ తనకు వద్దంటే వద్దని ససేమిరా అండతో ఇంటి సభ్యులు అందరూ కచ్చితంగా తీసుకోవాలని ఒప్పించడంతో ఇష్టం లేకున్నా తీసుకున్నాడు. ఇక ఆ తరువాత కెప్టెన్సీ పోటీలో భాగంగా మైన్ లోకి వెళ్ళడానికి సిద్దంగా ఉన్న మానస్, ఆనీ మాస్టర్, శ్రీరామచంద్రలలో ఎవరో ఒకరి స్థానంలో సన్నీ పోటీ చేసే అవకాశం ఆ పవర్ టూల్ ద్వారా పొందుతాడు.

విజె సన్నీ కోపంతో పవర్ టూల్ కోసం వెళ్తున్న సమయంలో కాజల్ కూడా వెంట నడవడంతో నా తోకలాగే వెనుకే వస్తావా అంటూ చిరాకు పడటంతో.. కాజల్ హర్ట్ అయి కన్నీరు పెట్టుకుంటుంది. ఆ తరువాత ఆ పవర్ టూల్ ని సన్నీ కాజల్ కి ఇవ్వాలని అనుకున్న అందుకు సంచాలక్ అలా కుదరదని చెప్పడంతో శ్రీరామచంద్ర స్థానంలో సన్నీ మైన్ లోకి దిగుతాడు. ఇక టాస్క్ ముగిసే సరికి ప్రియాంక సింగ్, సిరి హనుమంత్, ఆనీ మాస్టర్, మానస్ కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు. ఇక ఆ తరువాత కాజల్ బాధపడటం చూసి సన్నీ ఆమెని ఓదార్చడం, మానస్ అటు కాజల్ తో పాటు ప్రియాంక సింగ్ తో సరిగ్గా మాట్లాడకపోవడం చూశాము.

ఇదిలా ఉండగా శన్ముఖ్ జస్వంత్ గత రెండు రోజులుగా దీప్తి సునయన ని గుర్తు చేసుకొని బాధపడటంతో పాటు సిరి హనుమంత్ కూడా శ్రీహన్ ని గుర్తు చేసుకుంది. ఐ హేట్ యూ అని పేపర్ పై రాసి శన్ముఖ్ కు ఇచ్చిన సిరి.. శన్ముఖ్ కి హగ్ ఇస్తూనే ఏడుస్తూ వెళ్ళిపోయింది. మరోపక్క ప్రియాంక సింగ్ తనని కాస్త మనిషిలా చూడు అని మానస్ తో అనడం అందుకు మానస్ సారీ చెప్పి ఆమెని కూల్ చేశాడు. త‌ర్వాత ఇంటిస‌భ్యుల‌తో కొన్ని క్ష‌ణాలు ఇంటికి అంకితం అనే స‌ర‌దా టాస్క్ లో జంట‌లుగా విడిపోయిన గేమ్ ఆడిన ఇంటి సభ్యులలో ఎక్కువ పాయింట్లతో ఆనీ మాస్ట‌ర్‌- శ్రీరామ్ జోడీ చెరో రూ.5000ల గిఫ్ట్ వోచ‌ర్ గెలుపొందారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story