ఫ్రెండ్ అంటాడు.. పెళ్ళాం అంటాడు.. సన్నీ చెప్పినట్టు శన్ముఖ్, సిరిలది ఓవరాక్టింగ్ బ్యాచేనా..!!

బిగ్ బాస్ తెలుగు (ఫోటో: స్టార్ మా)
* బిగ్ బాస్ సీజన్ 5 గురువారం ఎపిసోడ్ (17/12/2021) హైలైట్స్
Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గురువారం ఎపిసోడ్ లో భాగంగా బుధవారం సిరి హనుమంత్ ఓవర్ యాక్షన్ ని ప్రేక్షకులు కూడా తట్టుకోలేకపోయారు. టాస్క్ లో ఆట తక్కువ శన్ముఖ్ తో మాటలెక్కువగా సాగుతున్న సిరి హనుమంత్ శన్ముఖ్ కోసం టైటిల్ ని కూడా వదులుకోడానికి సిద్ధమైంది. ఆ మాటతో ఆ మాత్రం దానికి బిగ్ బాస్ హౌస్ కి రావడం ఎందుకో ఈ హగ్గులతో అలకలతో మా బుర్ర తినడం ఎందుకోనని బుల్లితెర ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. ఇక శన్ముఖ్ జస్వంత్ కూడా చివరి వారం వచ్చిన సిరి హనుమంత్ తో హగ్గుల్లో మాత్రం ఏ మాత్రం తగ్గకుండా బుల్లితెర ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాడనే చెప్పొచ్చు. గురువారం ఎపిసోడ్ గాజువాక పిల్ల పాటతో మొదలై సిరి హనుమంత్ సన్నీతో అనవసరంగా పెట్టుకున్న గొడవతో ముగిసింది.
ఎపిసోడ్ విషయానికొస్తే గార్డెన్ ఏరియాలో ఉన్న సోఫాలో సిరి - శన్ముఖ్ జస్వంత్ లు కూర్చుని ఉండగా.. శన్ముఖ్ బిగ్ బాస్‌ని ఇమినేట్ చేస్తూ సిరి ఉద్దేశించి.. "బిగ్ బాస్ కోరికమేరకు సిరి.. పెళ్ళాం ఇచ్చినట్టు అడక్కుండానే కాఫీ ఇవ్వకండి" అని అన్నాడు. పెళ్ళాం అని అనగానే సిరి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ.. ఏంటి సార్ మీకు అలా అనిపిస్తుందా?? పొద్దు పొద్దున్నే ఏమైంది మీకు అని అడిగింది. దీంతో షణ్ముఖ్.. ఏంటి సిరీ.. నా ఫొటోలు పెట్టావ్.. ఊ ఊ పడిపోయావ్ అని అన్నాడు. ఏంటి నీకు పడిపోయానా? అని సిరి అడిగితే.. "మరి ఫొటోలు ఎందుకు పెట్టావని శన్ముఖ్ అడగడంతో రోజులాగే ప్రేక్షకులకు చిరాకు తెప్పించే పనికిరాని సంభాషణతో పాటు సిరి ఒళ్ళో తలపెట్టి మరీ శన్ముఖ్ ముచ్చటించాడు.
ఇక బలూన్ టాస్క్ లో శన్ముఖ్, టీషర్టు టాస్క్ లో మానస్, సౌండ్స్‌ను గుర్తించే టాస్క్ లో శ్రీరామ్, తాడు టాస్కులో సన్నీ విజేతగా నిలిచాడు. గేమ్ లో ఉన్నప్పుడు తాడుతో సరిగ్గా వేవ్స్ ఇవ్వలేదంటూ సిరి సన్నీని కామెంట్ చేసింది. ఆట ముగిసిన తరువాత శన్ముఖ్ కి సపోర్ట్ గా సిరి మాట్లాడటంతో నువ్వు ఓడిపోయావని సిరిని సన్నీ సరదాగా ఆట పట్టించేందుకు ప్రయత్నించగా సిరి మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకుంది. నేను ఓడిపోయానని అనొద్దని.. ఓడిపోయావ్ అనడం జోకా అని ఫైర్ అయిన సిరిని కూల్ చేసేందుకు సన్నీ ప్రయత్నించాడు.
ఎంతకి సిరి తీరు మారకపోవడంతో నేను సరదాగానే ఆ మాట అన్నానని అప్పుడు జోక్‌గా అన్నాను కాని ఇప్పుడు మాత్రం కాదు అని సన్నీ అన్నాడు. నన్ను ఇమిటేట్ చేయకంటూ సిరి వేలు చూపించడంతో సన్నీ.."నాకు వేలు చూపించొద్దు" అని సిరిని హెచ్చరించాడు. ఆ తరువాత బాత్రూమ్ వద్ద శన్ముఖ్ సిరిని వెనుక నుండి వచ్చి వాటేసుకున్నాడు. సిరి వారించినా షణ్ముఖ్ వదల్లేదు. దీన్ని అన్ సీన్లో ఎపిసోడ్ లో చూపించారు. సన్నీ.. మానస్‌తో మాట్లాడుతూ ఎప్పుడు ఏ గొడవైనా కూడా నేనే వెళ్తాను, ఇంత ఓవరాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? వెళ్లేముందు నన్ను బ్యాడ్ చేస్తే వాళ్లకు ఏమొస్తదిరా? నువ్వు పెద్ద హీరోవా? అంటే నన్ను ఇష్టపడేవాళ్లకు, నా దునియాల నేను హీరోనే' అని స్పష్టం చేశాడు విజె సన్నీ.
బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఓటేసేందుకు శుక్రవారం ఆఖరి రోజు. అర్ధరాత్రి 12 గంటల వరకు లైన్స్ ఓపెన్‌లో ఉంటాయి. ఆ తర్వాత ఓటేసినా ఫలితం ఉండదు. కాబట్టి.. మీ ఫెవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవాలంటే.. వెంటనే ఓటేయండి.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT