Bigg Boss 5 Highlights: ఎవరేమనుకున్న హగ్గుల్లో తగ్గేదేలే అంటున్న శన్ముఖ్, సిరి

Sandeep Reddy
Published on: 3 Dec 2021 11:58 AM IST
Bigg Boss Telugu Season 5 Thursday Episode 89 Highlights Today 02nd December 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజ‌న్ 5 తెలుగు గురువారం ఎపిసోడ్ లో భాగంగా "టికెట్ టూ ఫినాలే" టాస్క్ మరింత ఆస‌క్తికరంగా సాగింది. మొద‌టి టాస్క్‌లో ఐస్ ట‌బ్‌ ఛాలెంజ్ లో పాల్గొన్న ఇంటి సభ్యులలో శ్రీరామ్, సిరి హనుమంత్, శన్ముక్ జస్వంత్ గాయపడగా.. రెండవ టాస్క్‌లో 29 నిమిషాలు లెక్కపెట్టాల్సి ఉండ‌గా, ఈ ఛాలెంజ్‌లో ఇంటి సభ్యులందరిలో మానస్‌ మొదటి స్థానంలో నిలిచాడు. ఇక నాగార్జున సహా సిరి హనుమంత్ - శన్ముఖ్ జస్వంత్ పేరెంట్స్ వచ్చి చెప్పినా హగ్గుల విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు.

హగ్ చేసుకున్న ప్రతీసారీ ఇది ఫ్రెండ్ షిప్ అంటూ శన్ముఖ్ జస్వంత్ పదేపదే చెప్తుంటే, సిరి హనుమంత్ మాత్రం నన్ను బాగా చూసుకుంటున్నాడు హగ్ ఇవ్వకపోతే ఎలా అంటూ హాగ్ లలో తగ్గేదేలే అన్నట్టుగా చేస్తుంది. ఇది చూస్తున్న ప్రేక్షకులు మాత్రం వీరి హగ్గుల గోల ఏంటో అని తలలు పట్టుకుంటున్నారు.ఇక మూడో టాస్క్ స్కిల్‌ ఛాలెంజ్‌ లో భాగంగా ఏటవాలుగా ఉన్న స్టాండ్‌లో నీళ్లు పోసి అందులోని జార్స్‌లో ఉన్న బంతులు కింద పడేలా చేయాలి. ఎవరైతే ముందుగా అన్ని బంతులను కిందపడిన తర్వాత బెల్ కొట్టాలి.

ముందుగా సన్నీ,శన్ముఖ్ జస్వంత్.. ఆ తర్వాత ఆర్జే కాజల్, ప్రియాంక సింగ్ పోటీ పడ్డారు. చివరిగా సిరి హనుమంత్ తరపున శన్ముఖ్, శ్రీరామ్ తరపున సన్నీ, మానస్‌తో పోటీ పడ్డారు. ఇందులో మానస్‌, శ్రీరామ్‌, సిరి, ప్రియాంక, కాజల్‌, సన్నీ, షణ్ముఖ్‌ వరుసగా ఏడు స్థానాల్లో నిలిచారు. అయితే అందరికంటే ఎక్కువగా మానస్ 18 పాయింట్లతో ముందున్నాడు. తరువాత స్థానంలో 16 పాయింట్లతో శ్రీరామ్, 15 పాయింట్లతో సిరి మూడో స్థానంలో ఉంది. 10 పాయింట్లతో సన్నీ టికెట్ టు ఫినాలేకి అర్హత సాధించిన వారిలో చివరి స్థానంలో ఉన్నాడు. "టికెట్ టు ఫినాలే"లోని మూడు టాస్క్ లలో తక్కువ పాయింట్లు రావడంతో ఆర్జే కాజల్, ప్రియాంక, శన్ముఖ్ జస్వంత్ పోటీ నుంచి తప్పుకున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story