BB5 Highlights: జనాలు మెచ్చలేదా..? బిగ్ బాస్ కి నచ్చలేదా..? ఎలిమినేట్ అయిన రవి

Sandeep Reddy
Updated on: 29 Nov 2021 11:24 AM IST
Bigg Boss Telugu Season 5 Sunday Episode Highlights Today 28th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆదివారం ఎపిసోడ్ లో భాగంగా బుల్లితెర ప్రేక్షకులు ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈవారం నామినేషన్ లో ఉన్న రవి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున బిగ్ బాస్ విజేతలకు ఇవ్వబోయే ప్రైజ్ మనీని అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాస్‌ విన్నర్‌ రూ.50 లక్షలతో పాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో 25 లక్షల రూపాయల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సొంతం చేసుకుంటారని తెలిపాడు.

ఇక ఇంటి సభ్యులు ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని నాగార్జున అడగగా మొదటగా ప్రియాంక సింగ్ మాట్లాడుతూ ఆ డబ్బుతో తన తల్లిదండ్రులకు ఒక ఇల్లు కొనిస్తానని, అంతేకాకుండా ఒక ఆడపిల్లని దత్తత తీసుకుంటానని తెలిపింది. ఇక సన్నీ తనకు వచ్చిన డబ్బు తన తల్లికి ఇవ్వడంతో పాటు ఒక బ్యూటీ సెలూన్ పెడతానని చెప్పాడు. కాజల్ తనకు ఉన్న 30 లక్షల రూపాయల అప్పును తీర్చేసి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ని కట్టాలనుకుంటున్నట్లు చెప్పింది. శన్ముఖ్ జస్వంత్ 50 లక్షల రూపాయల్లో 25 లక్షలు తన తల్లి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న పిల్లలకు ఇస్తానని, మిగిలిన 25 లక్షలు తాను ఈ స్థాయి వరకు రావడానికి సహాయపడిన దీప్తి సునయనకి ఇస్తానని చెప్పాడు.

ఇక మానస్ ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టి కొత్త నటులను ఎంకరేజ్ చేస్తానని తెలిపాడు. ఆదివారం చివరకు ​రవి, కాజల్‌ నామినేషన్స్‌లో మిగిలారు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ను నువ్వు వాడుకుంటావా? లేదా వీళ్లలో ఒకరిని సేవ్‌ చేస్తావా? అని సన్నీని అడిగాడు. ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ నాకు రావడానికి కారణమైన కాజల్‌ కోసం వాడాడు. కానీ ఓటింగ్‌లో రవి చివరి స్థానంలో ఉండటంతో అతడు ఎలిమినేట్‌ అయ్యాడని నాగార్జున ప్రకటించాడు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వాడి ఉపయోగం లేకపోయింది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనుకున్న రవి ఇంటిని వదిలి వెళ్ళిపోతుండటంతో సన్నీ తన దగ్గరున్న గిఫ్ట్‌ వోచర్‌ను రవికి బహుమతిగా ఇచ్చాడు.

రవి ఎలిమినేషన్‌ను ఊహించుకోలేకపోయిన ఇంటి సభ్యులందరూ ఎంతో బాధతో రవికి వీడ్కోలు పలికారు. ఇక బిగ్ బాస్ స్టేజిపైకి వచ్చిన రవి ఇంత త్వరగా ఇంటి నుండి బయటకు వచ్చేస్తానని ఊహించలేదని, ప్రేక్షకులు తీర్పే నన్ను ఇక్కడ ఉంచిందని రవి బాధపడ్డాడు. చివరగా ఈ బిగ్‌బాస్‌ ప్రయాణంలో ఎవరు పాస్‌, ఎవరు ఫెయిల్‌? అనే ఆటలో శన్ముఖ్ జస్వంత్, సన్నీ, శ్రీరామచంద్ర పాస్ అని, ప్రియాంక సింగ్, మానస్, సిరి హనుమంత్, ఆర్జే కాజల్ ఫెయిల్ అని చెప్పి బిగ్ బాస్ కి రవి గుడ్ బై చెప్పాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story