Bigg Boss 5 Promo: డేంజర్ జోన్ లో రవి, కాజల్.. ఈవారం ఎలిమినేట్ అయ్యేదేవరో..?

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 28 Nov 2021 5:36 PM IST
Bigg Boss Telugu Season 5 Sunday Episode Promo Released Today 28th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 Promo: డేంజర్ జోన్ లో రవి, కాజల్(ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఆదివారం ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ వారం నామినేషన్ లో భాగంగా శనివారం ఎపిసోడ్ లో విజే సన్నీ, శ్రీరామచంద్ర, సిరి హనుమంత్ సేవ్ అయ్యారు. తాజా ప్రోమో ప్రకారం డేంజర్ జోన్ లో ఆర్జే కాజల్ తో పాటు రవి ఉన్నారు. అయితే ఎలిమినేషన్ నుండి బయటపడటానికి సన్నీకి ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ తప్ప మరో మార్గం లేదని హోస్ట్ నాగార్జున చెప్తాడు.

ఇక తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ నీకోసం వాడుకుంటావా లేదా వారిద్దరిలో ఎవరి కోసమైన వాడుతావని సన్నీని నాగార్జున అడగడంతో రవి, కాజల్ ఇద్దరు తనకు ఇష్టమేనని అనడం.. వెంటనే శన్ముఖ్ జస్వంత్ ఆలోచించు సన్నీ చెప్పడం ప్రోమోలో చూడవచ్చు. మరి సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని తన స్నేహితురాలైన కాజల్ కోసం వాడుతాడో లేదా రవి కోసం వాడుతాడో లేదా ఎవరి కోసం ఆ పాస్ ని వాడకుండా తన వద్దే ఉంచుకుంటాడో తెలియాలంటే ఈరోజు (ఆదివారం) ఎపిసోడ్ చూడాల్సిందే..


Sandeep Reddy

Sandeep Reddy

Next Story