Bigg Boss 5 Highlights: "కప్పు ముఖ్యం బిగిలూ".. అందరికీ నచ్చిన ఆ ఒక్కడు..!!

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు వీకెండ్ (28/11/2021) ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Published on: 28 Nov 2021 12:01 PM IST
Bigg Boss Telugu Season 5 Saturday Episode Highlights Today 27th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు శనివారం ఎపిసోడ్ లో భాగంగా హోస్ట్ నాగార్జున.. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మరోసారి వారి వారి స్నేహితులు, కుటుంబ సభ్యులను బిగ్ బాస్ స్టేజిపై కలిసే అవకాశాన్ని కల్పించాడు. అయితే అందుకోసం ఇంటి సభ్యులకు ఇష్టమైన ఒక వస్తువును సాక్రిఫైస్ బాక్స్ లో వేయాలని నాగార్జున ఒక కండిషన్ పెట్టాడు. అందుకు ఒప్పుకున్న ఇంటి సభ్యులలో మొదటగా రవి.. తన పాప బొమ్మని త్యాగం చేయడంతో రవి తల్లి ఉమాదేవితో పాటు బిగ్ బాస్ మొదటి సీజన్ విజేత శివబాలాజీ స్టేజి మీదకు వచ్చారు.

రవిని బిగ్ బాస్ లో చూడటం ఎంతో గర్వంగా ఉందని అతని తల్లి చెప్పింది. శివబాలాజీ మాట్లాడుతూ ఎవరికీ సపోర్ట్ చేయకని, చెప్పాలి అనుకున్నది చెప్పి అక్కడి నుండి వెళ్ళిపో అని సలహా ఇచ్చాడు. రవి,విజే సన్నీ, శ్రీరామచంద్ర‌, శన్ముఖ్‌, మానస్‌లు టాప్ 5 లో ఉంటారని ఉమాదేవి చెప్పింది.ఆ తరువాత ప్రియాంక సింగ్ తన మేకప్ కిట్ ని త్యాగం చేయడంతో జబర్దస్త్ కమెడియన్స్ అప్పారావు, సాయి వచ్చి ప్రియాంక సింగ్ తో పాటు రవి, విజే సన్నీ, శ్రీరామచంద్ర, మానస్ లు టాప్ 5 ఉంటారని చెప్పుకొచ్చారు.

ఆ తరువాత సన్నీ తనకు స్నేహితులు ఇచ్చిన స్పెషల్‌ గిఫ్ట్‌ను త్యాగం చేయగా అతడి ఇద్దరు ఫ్రెండ్స్‌ వెంకట్‌, నిఖిల్‌ స్టేజీపై సందడి చేశారు. కప్పు ముఖ్యం బిగిలూ అంటూ బోర్డు మీద సన్నీని విన్నర్ స్థానంలో ఉంచారు. శన్ముఖ్‌, మానస్‌, శ్రీరామచంద్ర, కాజల్‌ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంచారు. ఆ తరువాత మానస్, సిరి హనుమంత్, కాజల్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా బిగ్ బాస్ స్టేజిపై సందడి చేశారు. శనివారం ఎపిసోడ్ లో భాగంగా ఈ వారం నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యులలో విజే సన్నీ, సిరి హనుమంత్, శ్రీరామచంద్రలు సేవ్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.

ఇక టాప్ 5 లో మానస్‌ కుటుంబ సభ్యులు ఫస్ట్‌ ప్లేస్‌లో మానస్ ని, సన్నీ, కాజల్‌, శ్రీరామ్‌, శన్ముఖ్ ను మిగిలిన నాలుగు స్థానాల్లో పెట్టారు.

కాజల్‌ కుటుంబ సభ్యులు కాజల్, విజే సన్నీ, శన్ముఖ్ జస్వంత్, శ్రీరామచంద్ర, మానస్‌ను తర్వాతి స్థానాల్లో పెట్టారు.

శ్రీరామచంద్ర కుటుంబ సభ్యులు శ్రీరామచంద్ర‌, రవి, ప్రియాంక సింగ్‌, విజే సన్నీ, శన్ముఖ్ లు వరుసగా టాప్‌ 5లో ఉంటారని చెప్పారు.

సిరి కోసం వచ్చిన శ్రీహాన్‌.. సన్నీ, శన్ముఖ్‌, రవి, శ్రీరామ్‌, సిరిలు వరుసగా టాప్‌ 5లో ఉంటారన్నాడు.

చివరగా శన్ముఖ్ కోసం వచ్చిన దీప్తి సునయన‌.. శన్ముఖ్‌, శ్రీరామ్‌, విజే సన్నీ, రవి, మానస్‌లు వరుసగా టాప్‌ 5లో ఉంటారని చెప్పారు. ఇక శనివారం ఎపిసోడ్ లో భాగంగా కుటుంబ సభ్యులు సన్నీని టాప్‌ 5లోని మొదటి రెండు స్థానాల్లో పెట్టి విజే సన్నీ బిగ్ బాస్ విన్నర్‌ అని చెప్పకనే చెప్పారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story