BB 5 Highlights: కాజల్ ని టార్గెట్ చేసిన ఆ నలుగురు.. వెకిలి నవ్వులతో నవ్వులపాలైన ఆనీ

Bigg Boss Telugu Season 5 Monday Full Episode Highlights Today 15th November 2021 | Bigg Boss 5 Updates
x

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Highlights

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సోమవారం ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నామినేషన్...

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సోమవారం ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నామినేషన్ కి ముందు శన్ముఖ్ జస్వంత్ సిరితో మాట్లాడుతూ జెస్సీ వెళ్ళినపుడు నాకే ఏడుపు రాలేదు కానీ వీరు ఏడవడం ఏంటి అని.. నటిస్తున్నారేమో అని అనుమానం వస్తుందని చెప్పాడు. ఆ తరువాత కాజల్..గతవారం నామినేషన్ లో సన్నీ, మానస్ లను సేవ్ చేసే అవకాశం ఉన్న చేయకపోవడంతో పాటు.., ఆదివారం ఎలిమినేట్ అయిన జెస్సీ నిన్ను నీ స్నేహితులు నమ్మట్లేద్దని చెప్పడంతో కాజల్ డైలమాలో పడిపోయింది. ఆ విషయాన్ని క్లారిటీ తెచ్చుకోవడానికి మానస్, సన్నీతో మాట్లాడింది. అప్పుడు మానస్ గేమ్ లో నిన్ను నమ్మం కానీ ఫ్రెండ్షిప్ లో మాత్రం తక్కువ చేసి చూడము అని చెప్పాడు.

విజే స‌న్నీ ఇంటి సభ్యుల గురించి మాన‌స్‌, ఆర్ జే కాజ‌ల్‌తో మాట్లాడాడు. ఆనీ మాస్ట‌ర్‌ అన‌కొండ, సిరి హనుమంత్ క‌ట్ల‌పాము, శన్ముఖ్ జస్వంత్ న‌ల్ల‌తాచు అని వారికి పేర్లు పెట్టడమే కాకుండా ర‌వికి మాత్రం న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఇచ్చిన గుంట‌న‌క్కే సరైనదని అన్నాడు. ఇక తనకు తాను కోతి లేదా చింపాంజీ అని చెప్తాడు.

11వ వారం నామినేష‌న్ ప్ర‌క్రియలో భాగంగా నామినేట్ చేయాల‌నుకున్న వ్య‌క్తుల త‌ల‌పై బాటిల్‌లోని స్లైస్ పోయాల‌ని బిగ్ బాస్ ఆదేశించాడు. మొద‌ట‌గా నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టిన కెప్టెన్ ర‌వి.. సన్నీని నామినేట్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సన్నీ ఆవేశంలో నోరు జారడని అంతేకాకుండా త‌న‌ను ఫేక్ అన‌డం న‌చ్చ‌లేదంటూ స‌న్నీని నామినేట్ చేశాడు. వీజే స‌న్నీని ఆపకుండా రెచ్చకొట్టే విధంగా మాట్లాడిందంటూ కాజ‌ల్‌ను నామినేట్ చేశాడు.

కాజల్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతేనే గొడ‌వ‌లు త‌గ్గిపోతాయ‌ని ఆమెను శన్ముఖ్ జస్వంత్ నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంక సింగ్ మాట్లాడే పద్ధతి నచ్చలేదని నామినేట్ చేశాడు. కాజ‌ల్ నామినేషన్ లో మాట్లాడుతూ ఎంత ప్రయత్నించిన ఆనీ మాస్టర్ తనకి క‌నెక్ట్ కావ‌ట్లేదని, పైగా వెక్కిరించ‌డం అస్స‌లు న‌చ్చ‌లేదంటూ ఆనీని నామినేట్ చేయడంతో వెకిలి నవ్వులతో కుప్పిగెంతులేస్తూ కాజల్ స‌హనాన్ని పరీక్షించింది. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వాలని పదే పదే మాట్లాడే ఆనీ మాస్టర్ తోటి ఇంటి సభ్యురాలైన కాజల్ మాట్లాడుతుంటే ఆమెకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బుల్లితెర ప్రేక్షకులు వాపోయారు.

ఇలా ఇంటి సభ్యులు ఒక్కొక్కరు వారి కారణాలతో నామినేట్ చేశారు.. నామినేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • రవి – సన్నీ, కాజల్
  • శన్ముఖ్ జస్వంత్ – ప్రియాంక , కాజల్
  • మానస్ – శన్ముఖ్ జస్వంత్, ఆనీ మాస్టర్
  • శ్రీరామచంద్ర – విజే సన్నీ, మానస్
  • ఆర్జే కాజల్ – ఆనీ మాస్టర్, శన్ముఖ్ జస్వంత్
  • సిరి హనుమంత్ – ప్రియాంక, కాజల్
  • ప్రియాంక సింగ్ – శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్
  • విజే సన్నీ – శ్రీరామచంద్ర, సిరి హనుమంత్
  • ఆనీ మాస్టర్ – మానస్, కాజల్

ఇలా వారం నామినేషన్ లో కెప్టెన్ రవి మినహా ఇంటి సభ్యులు అందరూ నామినేట్ అవడం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories