Bigg Boss 5 Promo: బంతి కిక్ టాస్క్ తో నామినేషన్స్ లో "కిక్" ఉండనుందా..!?

* తాజాగా విడుదలైన బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సోమవారం నామినేషన్ ప్రక్రియ ప్రోమో

Sandeep Reddy
Published on: 29 Nov 2021 3:25 PM IST
Bigg Boss Telugu Season 5 Monday Episode Promo Today 29th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సోమవారం ప్రోమో తాజాగా విడుదలైంది. ఇప్పటికే టాప్ 5 లో నిలుస్తాడని అనుకున్న రవి ఎలిమినేట్ అవడంతో షాక్ లో ఉన్న ఇంటి సభ్యులు 13వ వారం నామినేషన్ లో పాల్గొన్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ గురించి చెప్పడం చూడొచ్చు. బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అవగానే ఇంటి సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకున్నారో ఆ ఇంటి సభ్యుడి పేస్ ఉన్న బాల్ ని గేటులోకి కిక్ చేయాలని ఆదేశిస్తాడు.

నామినేషన్ లో భాగంగా ఈ వారం శ్రీరామచంద్రతో కనెక్షన్ సరిగ్గాలేదని విజే సన్నీ మరోసారి అతడిని నామినేట్ చేశాడు. ఇక ప్రియాంక సింగ్.. తనకి ఎవరిని నామినేట్ చేయాలనీ లేదనిఅంటుంటే సన్నీ సరదాగా కామెంట్ చేయడం.. కచ్చితంగా ఎవరినైనా నామినేట్ చేయాల్సిందేనని కెప్టెన్ శన్ముఖ్ జస్వంత్ అనడంతో నిన్నే నామినేట్ చేయాలనుకున్న కాని ఆ అవకాశం లేదని చెప్పడం ప్రోమోలో చూశాము. ఇక నామినేషన్ సమయం ముగుస్తుండటంతో చివరిసారిగా ఇంటి సభ్యుల్లో ఎవరినైనా నామినేట్ చేయాలని లేదంటే డైరెక్ట్ గా నామినేషన్ లోకి వెళ్తావని బిగ్ బాస్ చివరిసారిగా హెచ్చరించడం ప్రోమోలో చూడవచ్చు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story