Bigg Boss 5 Highlights: సన్నీనే "నెంబర్ వన్" అని ఒప్పుకున్న ఇంటి సభ్యులు

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)
x
Highlights

*బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సోమవారం (07/12/2021) ఎపిసోడ్ హైలైట్స్

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సోమవారం ఎపిసోడ్ లో భాగంగా మరోసారి శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ మధ్య జరిగిన గొడవ, సంభాషణతో బుల్లితెర ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. కాజల్ టాప్ 5 లో ఉండాలని అనుకుంటుందని అందుకు తగ్గట్లుగానే ఆమె గేమ్ ఆడుతుందని సిరి హనుమంత్ ని జాగ్రత్తగా ఉండమని శన్ముఖ్ చెప్పాడు. ఆ తరువాత కాజల్ సన్నీకి, సిరి హనుమంత్ కూడా శన్ముఖ్ జస్వంత్ కి దిష్టి తీసింది.

ఇక విజే సన్నీ.. సిరి హనుమంత్ ని చూశాడని మానస్, కాజల్ బాగా ఏడిపించిన సమయంలో సిరి కూడా వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండటంతో అప్పటివరకు పడుకొని ఉన్న శన్ముఖ్ లేచి హాల్ లో కూర్చున్నాడు. దాంతో సిరి.. శన్ముఖ్ దగ్గరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా 'నీతో ఎవరు గేమ్ ఆడుతున్నారో నీకు తెలియదు. కావాలని ట్రాక్ లు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. నీ క్యారెక్టర్ వరస్ట్ గా వెళ్తది బయటకు' అని డైలాగ్ వేశాడు. అంతటితో సిరి మాట్లాడుతూ 'నెగెటివ్ గా ఆలోచించకు శన్ను.. సిట్యుయేషన్ కు తగ్గట్లు రియాక్ట్ అయ్యాను అంతే' అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. అయినా షణ్ముఖ్ మాత్రం కోపంగానే ఉన్నాడు. 'నేనేం అన్నాను.. అసలు నా ఇంటెన్షన్ ఏంటి..? పిచ్చెక్కిపోతుంది నాకు' అంటూ తనలో తనే మాట్లాడుకుంది సిరి.

ఉదయం కూడా సన్నీతో సిరికి లింక్ పెడుతూ కాజల్ ఏడిపించింది. వెంటనే సిరి హనుమంత్.. విజే సన్నీని అన్నయ్య అని పిలిచేసింది. నన్ను సిరి అన్నయ్య అని పిలిచినప్పుడు శన్ముఖ్ విని ఉంటే 1000 వాట్స్ బల్బ్ లా వెలిగిపోయేది అంటాడు సన్నీ. ఆ తరువాత శన్ముఖ్ బిగ్ బాస్ తో మాట్లాడుతూ 'నేను చాలా బోరింగ్ పర్సన్. నన్ను జనాలు ఇన్ని రోజులు ఎలా చూశారా అనిపిస్తుంది. ఇన్ని రోజుల్లో కొన్నిసార్లు గేమ్ బాగా ఆడలేదనిపిస్తుంది. కొన్ని సార్లు ఎమోషనల్ అయ్యా' అంటూ చెప్పుకున్నాడు.

ఆ తరువాత బిగ్ బాస్ నుండి అసలు ఆట ఇప్పుడే మొదలైందని చెప్తూ గార్డెన్ ఏరియాలో ఉన్న ఒకటి నుంచి ఆరు వరకు ర్యాంకులను ఎవరికి సూట్ అవుతాయో మాట్లాడుకొని ఆ నంబర్ల వెనుక నిలబడమని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెబుతాడు. దీంతో ఇంటి సభ్యుల మధ్య జరిగిన సంభాషణతో కాసేపు గొడవలు, అలకలతో ఒకరికి ఒకరు వారి అభిప్రాయాలు చెప్పినా చివరగా ఇంటి సభ్యులు అందరూ చర్చించుకొని మొదటి స్థానంలో సన్నీ, రెండో స్థానంలో శన్ముఖ్ జస్వంత్, మూడో స్థానంలో కాజల్, నాల్గో స్థానంలో శ్రీరామ్, ఐదో స్థానంలో మానస్, ఆరో స్థానంలో సిరి నిలిచింది.

ఇక చివరగా టాప్ 5 లో ఎవరు ఉండాలో ప్రేక్షకులే డిసైడ్ చేస్తారని ఇప్పటికే "టికెట్ టూ ఫైనలే" లో ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఉన్న శ్రీరామచంద్ర మినహా మిగిలిన ఇంటి సభ్యులు విజే సన్నీ, శన్ముఖ్, సిరి, మానస్, కాజల్ ఈవారం నేరుగా నామినేట్ అయ్యారని చెప్తాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories