Bigg Boss 5 Grand Finale Promo: "ఆర్ఆర్ఆర్" రిలీజ్ అయిందంటూ సన్నీకి జక్కన్న కౌంటర్

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 19 Dec 2021 2:16 PM IST
Bigg Boss 5 Grand Finale Promo: ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిందంటూ సన్నీకి జక్కన్న కౌంటర్
X

Bigg Boss 5 Grand Finale Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిధులుగా ఎస్ఎస్ రాజమౌళి, రణబీర్ కపూర్, అలియా భట్, సుకుమార్, రష్మిక మంధన, దేవిశ్రీప్రసాద్, నాని, సాయిపల్లవి, కృతిశెట్టి హాజరయ్యారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ కూడా ఈ గ్రాండ్ ఫైనలే వేడుకలో పాల్గొన్నారు. రాహుల్ సిప్లిగంజ్ నాటు నాటు సాంగ్ తో అలరించగా.., నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్ తమ డాన్స్ తో బిగ్ బాస్ స్టేజిపై దుమ్ములేపారు.

ఇక దర్శకుడు రాజమౌళి ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని అందరిని వదిలేసి అంటున్న సమయంలో విజె సన్నీ "ఆర్ఆర్ఆర్" సినిమాని కూడా చాలా మిస్ అయ్యాము సర్ అనగానే జక్కన్న "ఆర్ఆర్ఆర్" రిలీజ్ అయిందని నవ్వుతూ చెప్పగానే ఇంటి సభ్యులంతా షాక్ అవడం ప్రోమోలో చూశాము. ఇక ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్టార్ హీరోలను దర్శకులను హీరోయిన్స్ ని బిగ్ బాస్ స్టేజిపై బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో చూడబోతున్నాం. మరి టాప్ 5 లో నిలిచిన ఇంటి సభ్యుల్లో ఎవరు విజేతగా నిలవనున్నారో ఈరోజు ఎపిసోడ్ తో తేలనుంది. మొత్తానికి బుల్లితెర ప్రేక్షకులకు ఈరోజు ప్రసారం కానున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మాత్రం ఫుల్ మీల్స్ లా ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story