Bigg Boss 5 Telugu: ఆ ముగ్గురిలో బిగ్ బాస్ టైటిల్ గెలిచేది అతడేనా..!?

Bigg Boss 5 Highlights: ఆ ముగ్గురిలో బిగ్ బాస్ టైటిల్ గెలిచేది అతడేనా..!?(ఫోటో: స్టార్ మా)
* నేడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్
Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో విజేతగా ఎవరు నిలుస్తారోనని బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారంకానున్న ఎపిసోడ్ లో భాగంగా ఇప్పటికే టాప్ 5 లో నిలిచిన ఇంటిసభ్యులు ఎవరికీ వారు తామే గెలుస్తామనే గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో వోటింగ్ పోల్ ని బట్టి చూస్తే పోటీ మాత్రం విజే సన్నీ, శ్రీరామ్, శన్ముఖ్ జస్వంత్ ల మధ్యే పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఈ ముగ్గురిలో కూడా శన్ముఖ్ జస్వంత్, శ్రీరామ్ కి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు నుండే మంచి ఫాలోయింగ్ ఉన్నా.. సీరియల్ నటుడిగా ఒక సాధారణ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విజె సన్నీ తన ఆటలతో.. తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని బుల్లితెర ప్రేక్షకుల నుండి శన్ముఖ్ జస్వంత్, శ్రీరామ్ కంటే కూడా అధికంగా ఓట్లు సంపాదించినట్లు సమాచారం. అయితే అధికారిక వోటింగ్ పోల్ ని పక్కనబెడితే సోషల్ మీడియాలో పోలింగ్ లో మాత్రం సన్నీ అత్యధిక ఓట్లతో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక చివరి రోజు శ్రీరామ్, శన్ముఖ్ మధ్య కొన్ని ఓట్ల తేడా మాత్రమే ఉండటంతో టాప్ 3 లో ఎవరు ఏ స్థానంలో నిలుస్తారోనని విషయంలోనూ క్లారిటీ లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి నుండి సిరి హనుమంత్, శన్ముఖ్ జస్వంత్ కలిసి ఉండటం.., ప్రతిరోజు వారిద్దరి హగ్గులు, అలకలు బుల్లితెర ప్రేక్షకులను సైతం అంతగా నచ్చలేదనే చెప్పాలి. ఆ కారణంగానే శన్ముఖ్ జస్వంత్ కి మొదటి వారం ఉన్నంత వోటింగ్ గ్రాండ్ ఫినాలే చివరి వారం చేరే సమయానికి భారీగా తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. మరి బిగ్ బాస్ టైటిల్ సంగీతం మాస్టర్ గెలుస్తాడో, ఎంటర్టైనర్ గెలుస్తాడో లేదా హగ్గుల గురు గెలుపొందుతారో వేచిచూడాల్సిందే.. ఇక ఈరోజు జరగబోయే గ్రాండ్ ఫినాలేకి రాజమౌళి, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, నాని, అలియా భట్, జగపతి బాబు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నట్లు సమాచారం.
విశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMTజనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMT
పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMTపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరికొత్త కాంట్రవర్సీ...
23 May 2022 9:23 AM GMTజనసేనాని నిర్ణయం.. ప్రొడ్యూసర్లలో కంగారు..
23 May 2022 9:19 AM GMTచైనాకు బాయ్ బాయ్... ఇండియాకు యాపిల్..
23 May 2022 9:07 AM GMT