Bigg Boss 5 Highlights: సన్నీ నేను కలిసిపోయామంటున్న శన్ముఖ్ జస్వంత్

Sandeep Reddy
Updated on: 20 Nov 2021 12:07 PM IST
Bigg Boss Telugu 5 Friday Episode Highlights 19th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss Telugu Season 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 శుక్రవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రింగ్ ఇజ్ కింగ్ లో ఎవరు చివరి వరకు ఒంటి చేత్తో పట్టుకుంటారో వారే ఈ వారం కెప్టెన్ గా నిలుస్తారని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. ఈ టాస్క్ లో ఆనీ మాస్టర్, ప్రియాంక సింగ్, మానస్, సిరి హనుమంత్ లు పాల్గొనగా చివరికి మానస్ విజేతగా నిలిచి ఈ వారం కెప్టెన్ గా ఎంపిక అవుతాడు. "నిప్పులే శ్వాస‌గా.. గుండెలో ఆశ‌గా" టాస్క్‌లో మీ ఫొటో కాల‌కుండా చూసుకోవాలని, చివ‌రి వ‌ర‌కు ఎవరి ఫొటో అయితే బర్న్ హౌస్ లో కాల‌కుండా ఉంటుందో ఆ ఇంటి సభ్యుడికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద‌క్కుతుంద‌ని బిగ్ బాస్ ప్ర‌క‌టించాడు.

ఇక ఆ తరువాత రవి.. శ్రీరామచంద్రతో మాట్లాడుతూ ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడని అనిపిస్తుందని.. సన్నీకి ఒకవేళ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చిన దానిని ఈ వారం ఉపయోగించుకోడని రవి జోస్యం చెప్పాడు. ఏవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో భాగంగా ఇద్దరు ఇంటి సభ్యులు.. బర్న్ హౌస్ లో ఉన్న ఇద్దరి ఇంటి సభ్యుల నుండి ఒకరిని ఈ విధంగా సేవ్ చేశారు.

శన్ముఖ్ జస్వంత్, రవి ---> మానస్, శ్రీరామచంద్ర ఇద్దరిలో శ్రీరామచంద్ర ని సేవ్ చేశారు.

మానస్, సన్నీ ----> రవి, ఆనీ మాస్టర్ లలో ఆనీ మాస్టర్ ని సేవ్ చేశారు

శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ ---> సన్నీ, ప్రియాంక సింగ్ లలో సన్నీని సేవ్ చేశారు

ఆనీ మాస్టర్, శ్రీరామచంద్ర --> శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ లలో సిరిని సేవ్ చేశారు

ఆనీ మాస్టర్, ప్రియాంక సింగ్ ---> సన్నీ, ఆర్జే కాజల్ లలో సన్నీని సేవ్ చేశారు

ఇక చివరగా మానస్, ఆర్జే కాజల్ --> ఆనీ మాస్టర్, సిరి హనుమంత్ ఇద్దరిలో ఎవరిని సేవ్ చేయాలో అని ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు రావడం కాజల్ ఇద్దరు కాలిపోతే చివరికి సన్నీకి ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుందని కాజల్ చెప్తుంది. అందుకు మానస్ ఒప్పుకోకుండా ఫేర్ గేమ్ ఆడుదామని ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవాలని కాజల్ చెప్పడం శుక్రవారం ఎపిసోడ్ లో జరిగింది.

ఇక టాస్క్ మధ్యలో విజే సన్నీని సేవ్ చేస్తూనని శన్ముఖ్ జస్వంత్ చెప్తూనే సన్నీ కి నాకు మధ్య ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవని, మా ఇద్దరి మధ్య ఇప్పుడిప్పుడే మంచి బంధం ఏర్పడుతుందని అందుచేతనే అతన్ని సేవ్ చేయాలనీ అనుకుంటున్నట్లు శన్ను చెప్పాడు. మొత్తానికి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శన్ను, సన్నీ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగిన తాజా పరిణామంతో మనమంతా ఒక్కటేనని అభిమానులు శాంతించారు.

ఇక అంతకు ముందు ఈ వారం ఎలిమినేట్ సన్నీ అవుతాడని చెప్పడంతో అటు సోషల్ మీడియాలో రవిపై ట్రోల్స్ చేస్తున్నారు సన్నీ ఫ్యాన్స్. సన్నీ టాప్ 3 లో నిలుస్తాడని కొందరు అంటుంటే మరికొంతమంది ఈ ఏడాది బిగ్ బాస్ టైటిల్ సన్నీదే అంటూ బల్ల గుద్ది చెబుతున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story