Bigg Boss 5 Highlights: ఇంటి సభ్యులకు సలహాలు ఇవ్వడం మానుకో.. పింకీకి బిగ్ బాస్ వార్నింగ్

Sandeep Reddy
Published on: 4 Dec 2021 12:19 PM IST
Bigg Boss Telugu Season 5 Friday Episode 90 Highlights Today 03rd December 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Highlights: బిగ్‌ బాస్‌ "టికెట్‌ టు ఫినాలే" రేసులో భాగంగా ఇంటి సభ్యులు ఐదో ఛాలెంజ్ "అక్యురెసీ" టాస్క్ ని ఎంచుకున్నారు.‌ ఈ టాస్క్‌లో బోర్డుపై ఉన్న బల్బ్ లలో కొన్ని ఆఫ్‌, కొన్ని ఆన్ చేసి ఉన్నాయి. తక్కువ సమయంలో బల్బ్స్ అన్నింటినీ ఆన్‌ చేసినవారు ప్రథమస్థానంలో నిలుస్తారు. ఈ టాస్క్ లో నడవలేకపోతున్న సిరి హనుమంత్, శ్రీరామచంద్ర ఇద్దరి తరపున శన్ముఖ్ జస్వంత్ గేమ్ లో పాల్గొన్నాడు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామచంద్ర‌, విజే సన్నీ, సిరి హనుమంత్, మానస్‌ వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇక ఈ టాస్క్ లన్ని ముగిసే సమయానికి చివరి స్థానాల్లో ఉన్న సిరి హనుమంత్, విజే సన్నీ "టికెట్‌ టు ఫినాలే" రేసు నుండి తప్పుకున్నారు.

సిరికి ఆరోగ్యం బాగలేకపోతే ప్రియాంక సింగ్ అరటిపండు తినమని, షుగర్‌ వాటర్‌ తాగమని సలహాలు ఇవ్వడంతో వెంటనే బిగ్‌ బాస్‌ స్పందించి నీకోసం కానీ, ఇతర ఇంటిసభ్యుల కోసం కానీ సొంత వైద్యం చేయడం మంచిది కాదని హెచ్చరించాడు. ఈ దెబ్బతో ప్రియాంక సింగ్ షాక్ అయింది. చివరి రౌండ్‌లో శ్రీరామ్‌, మానస్‌ పోటీపడగా శ్రీరామ్‌ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. సన్నీ, శన్ముఖ్ జస్వంత్ ఇద్దరూ తన విజయం సాధించడానికి సహాయం చేశారని వారికి అభినందనలు తెలిపాడు. ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అయ్యానని శ్రీరామచంద్ర ఆనందంలో మునిగిపోయాడు. మరోపక్క చివరిరౌండ్ వరకు వచ్చి ఓటమిని పాలైనందుకు మానస్‌ బాధపడ్డాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story