విజేగా మొదలై "బిగ్ బాస్" నుండి "హీరో"గా రాబోతున్న సన్నీ గురించి మీకు తెలుసా..!!

Sandeep Reddy
Published on: 13 Dec 2021 5:34 PM IST
About Bigg Boss Season 5 Contestant VJ Sunny
X

విజేగా మొదలై "బిగ్ బాస్" నుండి "హీరో"గా రాబోతున్న సన్నీ గురించి మీకు తెలుసా..!!

VJ Sunny: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో 19 మంది కంటెస్టంట్స్ లో ఒకడిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజే సన్నీ.. తన మాట, ఆటతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొని టాప్ 5 నిలిచాడు. సీజన్ మొదటి నుండి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సన్నీ అతి తక్కువ సమయంలోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో సన్నీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ లేదు అని తోటి ఇంటి సభ్యులే పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.

ఇంటి సభ్యులతో విజె సన్నీ మాట్లాడే తీరు.., తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించడమే ప్రస్తుతం సన్నీ టాప్ 5 లో నిలవడానికి కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం అటు అభిమానుల ఓటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉన్న సన్నీకే బిగ్ బాస్ టైటిల్ కూడా దక్కనుందని సోషల్ మీడియాలో వస్తున్న పోలింగ్ తో అర్ధమవుతుంది. బిగ్ బాస్ షోలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సన్నీ జర్నీ గురించి ఒకసారి చూద్దాం..

1989 ఆగష్టు 17న ఖమ్మంలో జన్మించిన విజే సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. ఖమ్మంలోనే స్కూల్, ఇంటర్ పూర్తి చేసుకున్న సన్నీ.. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బి.కామ్ చేశారు. చిన్ననాటి నుండి నటనపై ఆసక్తితో ఉన్న సన్నీకి తన తల్లి కళావతి కూడా సపోర్ట్ చేయడంతో నటన రంగంలోకి అడుగుపెట్టాలనే ఆసక్తితో ఉన్నాడు.

చిన్న వయస్సులో సన్నీ వేసిన "అల్లాద్దీన్" అనే నాటకానికి మంచి గుర్తింపు వచ్చింది. ఒక ప్రముఖ ఛానెల్ లో "జస్ట్ ఫర్ మెన్" అనే టీవీ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన సన్నీ ఒక న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా కూడా కొంతకాలం పని చేశాడు.

ఆ తరువాత "కళ్యాణ వైభోగం" అనే టీవీ సీరియల్ లో జయసూర్య అనే ప్రధానపాత్రలో నటించి బుల్లితెరలో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సీరియల్ లో తన నటనతో అభిమానులను సంపాదించుకున్న సన్నీ.. నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ సీరియల్ నుండి కొన్ని కారణాలతో తప్పుకున్న సన్నీ హీరోగా "సకలగుణాభి రామ" అనే సినిమాతో త్వరలో హీరోగా వెండితెరపై కనిపించనున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీకి ముందే దాదాపుగా సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న సన్నీ.. బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయిన తరువాత ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే "సకలగుణాభి రామ" సినిమా నుండి ఒక పాటని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story