Top
logo

Bigg Boss 4 Telugu: కెప్టెన్సీ పోటీదారుల కోసం పల్లెకు పోదాం చలో చలో.. మూడు హత్యలు చేయాలన్న బిగ్‌బాస్..

Bigg Boss 4 Telugu: కెప్టెన్సీ పోటీదారుల కోసం పల్లెకు పోదాం చలో చలో.. మూడు హత్యలు చేయాలన్న బిగ్‌బాస్..
X
Highlights

Bigg Boss 4 Telugu : బిగ్‌బాస్‌ 4వ సీజన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. 59వ రోజు ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ ఇచ్చిన...

Bigg Boss 4 Telugu : బిగ్‌బాస్‌ 4వ సీజన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. 59వ రోజు ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. కంటెస్టెంట్ల మధ్య చోటుచేసుకున్న చిన్న చిన్న గొడవలు ఈ ఎపిసోడ్‌లో కొంత హైలెట్‌గా నిలిచాయి. ఇక ఇవాళ్టి బిగ్‌బాస్‌లోని మరిన్ని హైలెట్స్ ఇప్పుడు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌ 59వ రోజుకు చేరుకుంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం పల్లెకు పోదాం చలో చలో టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. దీంతో ఇంటి సభ్యులు టాస్క్‌లో పూర్తిగా మునిగిపోయి ఆడుతున్నారు. 59వ రోజు ఇంటిసభ్యులను రామ్‌చరణ్‌ నటించిన రంగస్థలంలోని ఓ పాటతో నిద్రలేపారు బిగ్‌బాస్. ఇక హౌజ్‌మేట్స్ అంతా నిద్ర మత్తును వదిలి గార్డెన్‌ ఏరియాలోకి వచ్చి జోష్‌తో చిందులేశారు.

ఇక సోహైల్ తన మైకును పక్కన పెట్టడం గమనించిన బిగ్‌బాస్ వెంటనే ధరించాలని కోరారు. అదే సమయంలో సోహైల్ వద్దకు వచ్చిన అరియానా ఏదో చేయాలని చెప్పగా యాజ్‌ ఏ హౌజ్‌మేట్‌గా చేయనంటూ చెప్పాడు సోహైల్. మ‌రోవైపు అఖిల్‌, మోనాల్ మ‌ధ్య ఇంకా దూరం త‌గ్గ‌కపోవడంతో ఒంట‌రిగా ఉన్న మోనాల్‌కు అభి కంపెనీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం ప‌ల్లెకు పోదాం చలో చలో అనే టాస్కు ఇచ్చారు. పల్లెటూరు వాతావరణంలో సాగే టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు వాళ్ళకు తగిన పాత్రలను కేటాయించారు. మండే మంట‌ను ఆర‌కుండా చూ‌డటం ఈ టాస్కులో ప్ర‌ధాన‌మైన‌దని బిగ్‌బాస్‌ చెప్పారు.

ఈ వారం బిగ్‌బాస్‌ ఇచ్చిన పల్లెకు పోదాం చలో చలో టాస్క్‌లో భాగంగా ఎవరెవరు ఏ పాత్ర పోషించాలో చెప్పారు బిగ్‌బాస్‌. ఒక్కొక్కరిని కన్ఫెషన్‌ రూంలోకి పిలిచి తమ క్యారెక్టర్ల గురించి బీబీ వివరించారు. టాస్క్‌లో భాగంగా గ్రామ‌పెద్ద‌గా సోహైల్‌ను, అత‌డి భార్య‌గా లాస్య‌, వీరి కూతురిగా అరియానా‌ను నియ‌మించారు. ఈ త‌ల్లీకూతుళ్ల‌కు అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అవినాష్ లైన్ వేస్తుంటారు. బాధ్య‌త లేని గ్రామ‌స్థుడు, లాస్య‌ త‌‌మ్ముడిగా అఖిల్ పాత్ర పోషించగా అభి, మోనాల్ వంట‌మ‌నుషులుగా మారిపోయారు.

మరోవైపు పుకార్లు పుట్టించే అమ్మాయిగా హారిక క్యారెక్టర్‌ను డిజైన్‌ చేస్తూ ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. రాజ‌శేఖ‌ర్‌పై కాఫీ చ‌ల్ల‌డం, అవినాష్‌కు కోపం తెప్పించి అరిచేలా చేయ‌డం, చంపాల‌నుకునే వ్య‌క్తి పేరు లిప్‌స్టిక్‌తో కిటికీ మీద రాయ‌డం వంటి మూడు హ‌త్య‌లు హారిక చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో అవినాష్ రంగ పాత్రలో ఓ పాన్ షాప్ ఓనర్‌గా కనిపించనున్నాడు. అరి‍యాణా లవర్‌గా అవినాష్‌ ఆకట్టుకోనున్నాడు. అవినాష్ తమ్ముడి క్యారెక్టర్‌ను మెహబూబ్‌కు ఇచ్చారు. అంతేకాదు మెహబూబ్‌కు రౌడీ పాత్రను అంటగట్టారు బిగ్‌బాస్‌.

ఇక పల్లెకు పోదాం చలో చలో టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులంతా ప‌ల్లె యాస మాట్లాడ‌టానికి విపరీతంగా ప్ర‌య‌త్నించారు. అయితే అది ఎక్కడా కూడా వర్క్‌అవుట్ అయినట్టు కనిపించలేదు. గ్రామ పెద్ద భార్య లాస్య తన చుట్టూ ఉన్నవాళ్లకు పల్లె యాసలో కొన్ని పనులు చెబుతుంటుంది. మరోవైపు మల్లి క్యారెక్టర్‌ చేస్తున్న హారిక మెహ‌బూబ్‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూనే అబ్బాయిలంద‌రికీ క‌న్ను గీటింది.

ఇక పాన్‌ షాప్‌ యజమాని రంగ గ్రామపెద్ద కూతురు వెంకట లక్ష్మితో సరసాలు ఆడటం చూసి ఫైర్ అయ్యాడు గ్రామపెద్ద సోహైల్. తనకు వెంకట లక్ష్మి కావాలని కన్నీళ్లు పెట్టుకున్నాడు రంగ. అందుకోసం సోహైల్‌ కాళ్ల మీద పడ్డాడు. అయినప్పటికీ చిరాకు పడుతూ ఊరిపెద్ద సోహైల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక మెహబూబ్‌ కట్టెలను దొంగిలించడంతో వాటిని వెతికి తీస్తాడు అమ్మ రాజశేఖర్. అదే సమయంలో సీక్రెట్‌ టాస్క్‌లో భాగంగా హారిక మాస్టర్‌పై కాఫీని పోస్తుంది. దీంతో మొదటి హత్య జరిగినట్టు ప్రకటిస్తారు బిగ్‌బాస్. చివరిలో మంటను ఆర్పేందుకు మెహబూబ్‌ నీళ్లు చల్లుతుండగా అడ్డుకుంటాడు గ్రామపెద్ద సోహైల్. అంతేకాదు ఒడ్లు, కట్టెల విషయంలోనూ మెహబూబ్‌, సోహైల్ మధ్య వివాదం తల్లెత్తుతుంది. మొత్తానికి నామినేష‌న్స్‌తో కాక మీదున్న హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన "ప‌ల్లెకు పోదాం చలో చలో" టాస్కు మొదటిరోజు నీర‌సంగా సాగినట్టు అనిపించింది.

Web TitleBigg boss Telugu season 4 November 4 episode 60 highlights
Next Story