Bigg Boss OTT: మాట నిలబెట్టుకున్న నాగార్జున

Bigg Boss Telugu OTT Final Contestants List Confirmed
x

Bigg Boss OTT: మాట నిలబెట్టుకున్న నాగార్జున

Highlights

Bigg Boss OTT: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫైనల్ ఎపిసోడ్ లో మాట్లాడుతూ హోస్ట్ నాగార్జున..

Bigg Boss OTT: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫైనల్ ఎపిసోడ్ లో మాట్లాడుతూ హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ సిక్స్ మరొక రెండు నెలల్లోనే మొదలవుతుందని ఈ సారి బిగ్ బాస్ సరికొత్త ఫార్మెట్లో ఉండబోతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. "జెనరల్ గా ఒక బిగ్ బాస్ సీజన్ తర్వాత మరొక సీజన్ మొదలుపెట్టడానికి ఎనిమిది నెలలు సమయం పడుతుంది. కానీ ఈసారి సరికొత్త ఫార్మేట్ బిగ్ బాస్ తో రెండు నెలల్లోనే మీ ముందుకు రాబోతున్నాము" అని చెప్పారు నాగార్జున. తాజా సమాచారం ప్రకారం నాగార్జున ఇప్పుడు తన మాట నిలబెట్టుకున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిగ్ బాస్ ఈసారి ప్రీమియర్ కానుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫిబ్రవరి 26 నుంచి మొదలు కాబోతోంది. గంట ఎపిసోడ్ లు కాకుండా ఈసారి బిగ్ బాస్ 24 గంటలు లైవ్ లోనే ఉంటుంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా బయటకు రావాల్సి ఉంది. మరోవైపు బిగ్ బాస్ నిర్మాతలు షో ని త్వరగా మొదలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ లో నుండి ఓడిపోయిన కొందరు హౌస్మేట్స్ కూడా మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 6 లో కనిపించనున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో అరియానా గ్లోరి ఉన్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఆమెతో మంతనాలు పూర్తయ్యాయని, మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి అరియనా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం.

ఈ సారి ఎలాగైన ట్రోఫీ గెలిచి, మరింత ఫేమస్‌ కావాలని అరియానా భావిస్తోందట. అందుకే ఓటీటీ బిగ్‌బాస్‌కి ఓకే చెప్పిందట. అరియానాతో పాటు మాజీ కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లో ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక కొత్త వారిలో యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, 'ఢీ-10' విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, 'సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌'వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాకర్‌ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరెవరు 'బిగ్‌బాస్‌'హౌస్‌లోకి అడుగుపెడతారు తెలియాలంటే కొద్ది రోజుల పాటు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories