Top
logo

కెప్టెన్సీ టాస్క్‌లో అఖిల్‌కు హాండిచ్చిన మోనాల్‌

కెప్టెన్సీ టాస్క్‌లో అఖిల్‌కు హాండిచ్చిన మోనాల్‌
X
Highlights

బిగ్‌బాస్‌ సీజన్‌-4 పదకొండోవారం ముగింపు దశకు వచ్చింది. అయితే ఈ వారం ఎలిమినేషన్‌కు అభిజిత్‌, హారిక,...

బిగ్‌బాస్‌ సీజన్‌-4 పదకొండోవారం ముగింపు దశకు వచ్చింది. అయితే ఈ వారం ఎలిమినేషన్‌కు అభిజిత్‌, హారిక, అరియానాతోపాటు లాస్య, సోహైల్‌, మోనాల్‌ నామినేట్‌ కాగా.. వీరిలో ప్రతీ ఒక్కరూ గేమ్‌ పరంగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సేవ్‌ కావడానికి బలంగా పోరాడుతున్నారు.

పదకొండోవారంలో టాస్క్‌ల కంటే కుటుంబ సభ్యుల సందడే ఎక్కువగా ఉంది. గత రెండు ఎపిసోడ్లు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ ఫ్యామలీ మెంబర్స్‌ని తీసుకొచ్చి ఏడిపించడంతోనే గడిచిపోయాయి. ఫైనల్‌గా లాస్య భర్త, కొడుకు ఎంట్రీతో ఫ్యామిలీ మెంబర్స్‌ ఎంట్రీకి ఎండ్‌కార్డు పడింది. కమాండో ఇన్‌స్టిట్యూట్‌ టాస్క్‌లో భాగంగా హౌస్‌లోకి లాస్య భర్త మంజునాథ్‌, కొడుకు జున్ను వచ్చారు. కుమారుడిని చూడగానే లాస్య ఏడ్చింది. ' బుజ్జీ.. అంటూ గార్డెన్‌ ఏరియా నుంచి పరుగెత్తుకొచ్చింది. ఏడ్చుకుంటూనే భర్తతో మాట్లాడింది.

నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉన్నావో.. నీ కన్నా ఎక్కువ స్ట్రాంగ్‌గా జున్ను ఉన్నాడని లాస్యతో చెప్పుకొచ్చాడు మంజునాథ్‌. బాగా ఆడుతున్నావ్‌ అని లాస్యతో చెప్పిన మంజునాథ్‌ ఇంకా స్ట్రాంగ్‌గా ఆడాలంటూ లాస్యను కోరాడు. కిచెన్‌లో ఎక్కువగా ఉండిపోకుండా, బయటికి వచ్చి గేమ్‌ ఆడాలంటూ లాస్యకు సలహా ఇచ్చాడు మంజునాథ్‌. ఇక జున్నును ఇంటి సభ్యులంతా ఆడించారు. అవినాష్‌ అయితే జోకర్‌ వేశం వేసి జున్నును నవ్వించాడు. అలాగే లాస్య భర్త మంజునాథ్‌ ముందే లాస్యను ఆంటీ అంటూ ఇంటిసభ్యులు ఆట పట్టించారు. లాస్య ఆంటీ కాదన్న మంజునాథ్‌ ముందుముందు మీరూ కూడా ఆంటీ, అంకుల్స్‌ అవుతారంటూ ఇంటిసభ్యులకు కౌంటర్‌ వేశాడు.

ఎట్టకేలకు హౌస్‌లో కమాండో ఇన్‌స్టిట్యూట్‌ టాస్క్‌ పూర్తయింది. దీంతో ఇంటిసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అటు అరియానా, హారికను అవినాష్‌ తనదైన శైలిలో ఆటపట్టించాడు. అనంతరం ఇంటిసభ్యులకు లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ ఇచ్చారు బిగ్‌బాస్‌. కమాండో ఇన్‌స్టిట్యూట్‌ టాస్క్‌ పూర్తయిందని బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు తెలియజేశారు. దీంతో లాస్య, అరియానా ఇంటిసభ‌్యులను హౌస్‌లోకి తీసుకొచ్చినందుకు బిగ్‌బాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. 75వ రోజు హౌస్‌లో బిగ్‌బాస్‌ రంగస్థలం సినిమాలోని ఓ సాంగ్‌ ప్లే చేశారు. ఈ సాంగ్‌కు ఇంటిసభ్యులందరూ గార్డెన్‌ ఏరియాలోకి వచ్చి డ్యాన్స్‌ ఇరగదీశారు.

అరియానా, హారిక ముస్తాబై ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతుండగా, అవినాష్‌ వచ్చి వారిని ఆటపట్టించాడు. తమ అందాన్ని చూసి అవినాష్‌ కల్లు తిప్పుకోలేకపోతున్నాడని అరియానా అనగా అందం గురించి మనం మాట్లాడుకోవద్దని అవినాష్‌ పంచ్‌ వేశాడు. లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు క్విజ్‌ పోటీ పెట్టాడు బిగ్‌బాస్‌. గార్డెన్‌ ఏరియాలో రిఫ్రిజిరేటర్‌ను పెట్టి వారికి కావాల్సిన లగ్జరీ బడ్జెట్‌ ఐటమ్స్‌ని దానిలోపల ఉంచారు. క్విజ్‌ గేమ్‌ ఆడి అవి పొందాలని కండీషన్‌ పెట్టాడు. క్విజ్‌ మాస్టర్‌గా అవినాష్‌ను ఎంపిక చేసిన బిగ్‌బాస్‌ పోటీ దారులుగా సోహైల్‌, లాస్య, మోనాల్‌, అభిజిత్‌ను పెట్టాడు. ఇక అభిజిత్‌, మోనాల్‌ అయితే అన్ని ప్రశ్నలకు చకచక సమాధానం చెప్పారు.

బిగ్‌బాస్‌ ఇంటికి హారిక కెప్టెన్‌ అయింది. గతంలో ఎనిమిది సార్లు కెప్టెన్సీ పోటీదారుగా ఎన్నికై చివర్లో ఓడిపోయిన హారిక మోనాల్‌ సాయంతో ఈసారి తన కోరికను నెరవేర్చుకుంది. ఇక మోనాల్‌ తనకు సహాయం చేయలేదని అఖిల్‌ ఫ్రస్టేషన్‌తో ఊగిపోయాడు. కమాండో ఇన్‌స్టిట్యూట్‌ టాస్క్‌ స్టార్స్‌ సాధించిన అఖిల్‌, అభిజిత్‌, హారికలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు. మొత్తానికి ఎనిమిది సార్లు పోటీ పడినా గెలవలేదని ఈసారి మోనాల్‌ సాయంతో గెలిచానని హారిక ఆనందంతో చిందులేసింది. నోయల్‌ టీషర్ట్‌ వేసుకుని ఈ టాస్క్ ఆడానని తన అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం కెప్టెన్‌ అయ్యానని సంతోషంతో ఉబ్బితబ్బిపోయింది.

కెప్టెన్సీ టాస్క్‌ ఓడిపోయిన బాధలో ఉన్న అఖిల్‌ను సోహైల్ ఓదార్చాడు. మోనాల్‌ కూడా వచ్చి అఖిల్‌ని ఓదార్చుతుండగా తనకు కొంచెం టైం కావాలని ఆమెను పంపించేశాడు. ఇక తనను అఖిల్‌ నమ్మలేదని హారిక తనను నమ్మి టాస్క్‌లో సాయం చేయమని కోరిందని అందుకే ఆమెకు సపోర్ట్‌ చేశానని మోనాల్ చెప్పుకొచ్చింది.

కెప్టెన్‌ అయిన హారికపై అభిజిత్‌ జోకులు వేశాడు. మోనాల్‌ ఎంత పని చేశావ్‌ అంటూ ఆమెను ఎందుకు కెప్టెన్‌ చేశావు అని హారికను ఆటపట్టించాడు. అయితే హారిక మాత్రం అభిజిత్‌కు గట్టిగానే ఇచ్చింది. కెప్టెన్‌ అయిన ఆనందంలో మైక్‌ ధరించకుండానే ఇళ్లంతా తిరుగుతున్న హారికను బిగ్‌బాస్‌ నుంచి 'మైకు ధరించు హారిక' అనే అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. దీంతో కెప్టెన్‌ హారికనే ఇంటి నియమాలు పాటిస్తలేదంటూ ఇంటి సభ్యులంతా హారికను ఆటపట్టించారు.

Web TitleBigg Boss Telugu: Akhil anger on Monal
Next Story