Bigg Boss 9 : బిగ్ బాస్‌లో డ్రామా పీక్స్..సంజనకు జీరో మార్కు, జైలు శిక్ష.. కళ్యాణ్‌కు ఊహించని పవర్!

Bigg Boss 9 : బిగ్ బాస్‌లో డ్రామా పీక్స్..సంజనకు జీరో మార్కు, జైలు శిక్ష.. కళ్యాణ్‌కు ఊహించని పవర్!
x

Bigg Boss 9 : బిగ్ బాస్‌లో డ్రామా పీక్స్..సంజనకు జీరో మార్కు, జైలు శిక్ష.. కళ్యాణ్‌కు ఊహించని పవర్!

Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా 13 వారాలు పూర్తి చేసుకుని, ఇప్పుడు 14వ వారంలోకి అడుగుపెట్టింది.

Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజయవంతంగా 13 వారాలు పూర్తి చేసుకుని, ఇప్పుడు 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఆదివారం ఎపిసోడ్‌లో రీతూ చౌదరీ ఊహించని విధంగా ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఫైనల్‌కు కేవలం ఒక్క వారం మాత్రమే మిగిలి ఉండటంతో, ప్రతి టాస్క్, ప్రతి నామినేషన్ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, సంజనా, భరణి ఉన్నారు.

ఇప్పటికే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో గెలిచిన కళ్యాణ్ ఫైనలిస్ట్‌గా నిలిచాడు. మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్‌లు ఫైనల్ రేసులో పోటీ పడుతున్నారు. అయితే, ఈ వారం హౌస్‌లో ఉన్న అందరూ నామినేషన్‌లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించడంతో ఉత్కంఠ పెరిగింది. ఈ నేపథ్యంలో డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉన్నందున, టాప్ 5లో ఎవరు చేరుతారనే దానిపై అభిమానుల్లో భారీ చర్చ మొదలైంది. కెప్టెన్ కళ్యాణ్‌కు నామినేషన్స్‌లో ఒకరిని సేవ్ చేసి, మరొకరిని డేంజర్ జోన్‌లోకి పంపే పవర్ ఇవ్వడం హౌస్‌లో కొత్త అలయన్స్‌లకు దారితీసింది.

టాప్ 5 ర్యాంకులను నిర్ణయించడానికి బిగ్ బాస్ బాక్స్ ఆఫ్ ఇంపాక్ట్ అనే ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లోకి పంపిన ఆరు బాక్సులలో రూ.0 నుంచి రూ.2,50,000 వరకూ వివిధ మొత్తాలు ఉన్నాయి. బంతిని పట్టుకున్న కంటెస్టెంట్ ఎవరికి ఎంత మొత్తం ఇవ్వాలో కారణం చెప్పి నిర్ణయించాల్సి వచ్చింది. హౌస్‌మేట్స్ నిర్ణయాల ప్రకారం, ఇమ్మాన్యుయెల్‌కు రూ.2,50,000, తనూజకు రూ.2,00,000, డీమాన్ పవన్‌కు రూ.1,50,000, సుమన్ శెట్టికి రూ.1,00,000, భరణికి రూ.50,000 లభించాయి.

ఈ పాయింట్ల కేటాయింపులో సంజనాకు తీవ్ర అన్యాయం జరిగింది. చివరకు మిగిలిన రూ.0 (జీరో) మొత్తాన్ని ఆమెకు కేటాయించాలని హౌస్‌మేట్స్ నిర్ణయించారు. ఈ నిర్ణయంపై సంజన తీవ్ర వాదన పెట్టుకుంది, "నేను ఎంత ఆడినా నాకు ఇచ్చింది జీరోనే" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చివరికి సంజనకు జీరో రావడంతో, బిగ్ బాస్ ఆమెను జైలులో పెట్టమని ఆదేశించాడు. దీంతో సంజన "నేను తల్లిలా ఆలోచించి ఎమోషనల్ ఫూల్ అవుతున్నా. ప్రతి వారం నన్నే టార్గెట్ చేస్తున్నారు" అంటూ భావోద్వేగానికి లోనైంది.

కళ్యాణ్ ద్వారా ఇమ్మాన్యుయెల్‌కు రూ.2,50,000 పాయింట్స్ దక్కడంతో అతను టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఆ తరువాత స్వింగ్ జరా అనే మరో ఫిజికల్ టాస్క్‌లో కూడా ఇమ్మాన్యుయెల్ అదరగొట్టి మొదటి స్థానంలో నిలిచాడు. అతనికి ఇమ్యూనిటీ లభించింది. భరణి, డీమాన్ పవన్, తనూజ, సుమన్ శెట్టి తర్వాతి స్థానాల్లో నిలిచారు. అలాగే, 92వ రోజు ఎపిసోడ్‌లో ఈ సీజన్‌లో కెప్టెన్ కాలేని ఏకైక సభ్యుడు భరణి కావడం వలన, అతనికి హౌస్ కెప్టెన్‌గా అవకాశం ఇచ్చి బిగ్ బాస్ అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ కెప్టెన్సీకి ఇమ్యూనిటీ మాత్రం లభించదు. చివరి వారంలో కళ్యాణ్, తనూజ మధ్య టైటిల్ రేసు మరింత వేడెక్కుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories