Bigg Boss Telugu 7: సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్‌బాస్‌.. సీజన్ 7 ప్రోమో రిలీజ్.. ఈ సారి హోస్ట్‌‌గా లేడీ యాంకర్?

Bigg Boss Telugu 7 Promo Video Released Check Here
x

Bigg Boss Telugu 7: సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్‌బాస్‌.. సీజన్ 7 ప్రోమో రిలీజ్.. ఈ సారి హోస్ట్‌‌గా లేడీ యాంకర్?

Highlights

Bigg Boss Telugu 7: సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్‌బాస్‌.. సీజన్ 7 ప్రోమో రిలీజ్.. ఈ సారి హోస్ట్‌‌గా లేడీ యాంకర్?

Bigg Boss Telugu 7: టీవీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించే ప్రోగ్రామ్స్‌లో ‘బిగ్‌బాస్‌’ (Bigg Boss) ఒకటిగా పేరుగాంచింది. తెలుగులో ఇప్పటి వరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా 7వ సీజన్‌ (Bigg Boss Telugu 7)తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ మేరకు మేకర్స్‌ నెట్టింట్లో ఓ వీడియోని రిలీజ్ చేశారు. బిగ్ బాస్ 7 ప్రోగ్రాం త్వరలోనే టెలికాస్ట్ కానుందని తెలిపారు.

అయితే, 6వ సీజన్ మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో 7వ సీజన్‌లో ఊహించని సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. కాగా, ఈ ప్రోగ్రాం మాటీవీతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లోనూ స్ట్రీమింగ్‌ కానుందని ప్రకటించారు.

BB7లో ఈసారి హోస్ట్ మారనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగార్జుననే హోస్ట్‌ చేస్తాడా లేదా.. మరెవరికైనా ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఇప్పటి వరకు వినిపిస్తున్న వివరాల మేరకు ఈసారి ఓ ప్రముఖ లేడీ యాంకర్‌ను హోస్ట్‌గా చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ వివరాలన్నీ తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories