Bigg Boss 5 Promo: "ఇవ్వు.. అన్నీ మానస్ కే ఇవ్వు" అంటూ పింకితో సన్నీ ఫన్

*బిగ్ బాస్ సీజన్ 5 మంగళవారం రెండో ప్రోమో విడుదల

Sandeep Reddy
Updated on: 9 Nov 2021 6:26 PM IST
Bigg Boss Season 5 Telugu Tuesday Episode Second Promo 09th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 Promo (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Promo: అనారోగ్యంతో జెస్సీ ఇంటిని విడిచి వెళ్ళిన తరువాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చినట్టుగా తాజాగా విడుదలైన ప్రోమోతో అర్ధమవుతుంది. "ఇది తినే అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది???" అని గార్డెన్ ఏరియాలో ఉంచిన ఒక ఫుడ్ ఐటెం పై ఇంటి సభ్యులు సరదాగా జోకులు వేసుకుంటూ ఎవరు తినాలా అని మాట్లాడుకుంటున్న సమయంలో ఈ తొక్కలో డిస్కషన్స్ ఏంటి తినేస్తే అయిపోద్ది కదా అంటూ విజే సన్నీ కామెడీ చేయడం.. ఆ తరువాత కెప్టెన్ నేనే కాబట్టి నాకు తినే అర్హత ఉందని ఆనీ మాస్టర్ అనడంతో విజే సన్నీ తినేయండి మాస్టర్ అని ఒప్పుకోవడం ప్రోమో చూశాము.

ఇక ఇంటి సభ్యులు అందరిని అడిగి ఒక నిర్ణయం తీసుకుందామని అనడంతో వెంటనే ప్రియాంక సింగ్.. నేను మానస్ కి ఇస్తాను అనడంతో ఇవ్వు అన్ని మానస్ కి ఇచ్చుకో లోపలి వెళ్లి ఇవ్వు.. జైలులో ఉన్నపుడు బయటికి తీసుకొని రాలేదు కాని నేను ఇస్తా అంటున్నావ్ అంటూ ప్రియాంక సింగ్ కి కౌంటర్ ఇస్తాడు విజే సన్నీ. మరి ఆ ఫుడ్ ఐటెం ఇంటి సభ్యుల్లో ఎవరు తిన్నారో తెలియాలంటే ఈరోజు (మంగళవారం) ఎపిసోడ్ చూడాల్సిందే.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story