Bigg Boss 5 Promo: నియంత మాటే శాసనం.. బిగ్ బాస్ 5 చివరి కెప్టెన్ ఎవరో..!?

* తాజాగా విడుదలైన బిగ్ బాస్ సీజన్ 5 మంగళవారం (23/11/2021) ప్రోమో

Sandeep Reddy
Updated on: 23 Nov 2021 1:39 PM IST
Bigg Boss Telugu 5 Tuesday Episode Promo Released Today 23rd November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మంగళవారం కెప్టెన్సీ టాస్క్ ప్రోమో తాజాగా విడుదలైంది. బిగ్ బాస్ 5 సీజన్ లో ఈ వారం చివరి కెప్టెన్ గా ఎవరు నిలుస్తారోనని అటు బుల్లితెర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం కెప్టెన్సీ పోటీలో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన "నియంత మాటే శాసనం" టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న సింహసనంపై ఎవరైతే బజర్ మ్రోగగానే కూర్చున్న వారు ఆ రౌండ్ కి సేఫ్ అవడంతో పాటు నియంతగా వ్యవహరిస్తారు.

ఇక మిగిలిన ఇంటి సభ్యులు వారిని వారు సేవ్ చేసుకోడానికి ఒక ఛాలెంజ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక ఈ ఛాలెంజ్ లో చివరి వరకు ఉన్న ఇద్దరు ఇంటి సభ్యులలో ఒకరిని సేవ్ చేసే అధికారం సింహాసనంపై కూర్చున్న నియంతకి ఉంటుందని బిగ్ బాస్ నియమాన్ని ఉంచుతాడు. ఈ టాస్క్ లో సింహాసనంపై సిరి హనుమంత్, శ్రీరామచంద్ర, రవి సింహాసనంపై కూర్చున్నట్లుగా ప్రోమోలో చూడవచ్చు. ఇక ఒక రౌండ్ లో శ్రీరామచంద్ర నియంతగా వ్యవహరించగా అందులో ఆర్జే కాజల్, రవి ఇద్దరు సేవ్ చేయమని అడగగా శ్రీరామచంద్ర మరోసారి తన కోపాన్ని కాజల్ చూపిస్తూ తాను రవిని సేవ్ చేయడం ప్రోమోలో చూశాము.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story