Bigg Boss 5 Promo: అనారోగ్యంతో జెస్సీ వెళ్ళేదారి ఇంటికా..? సీక్రెట్ రూమ్..?

* బిగ్ బాస్ సీజన్ 5 మంగళవారం ప్రోమో విడుదల

Sandeep Reddy
Updated on: 9 Nov 2021 2:58 PM IST
Bigg Boss Season 5 Telugu Tuesday Episode Promo 09th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Promo - Jessie Elimination Reason: బిగ్ బాస్ సీజన్ 4 లో ఆరోగ్యం సహకరించక ఇంటి నుండి బయటికి వెళ్ళిన గంగమ్మ లాగే మరోసారి బిగ్ బాస్ 5 లో కూడా అనారోగ్యం కారణాలతో జెస్సీ బయటికి వెళ్లనున్నాడా అని గత కొన్ని రోజులుగా అతడి ఆరోగ్య పరిస్థితి చూసిన బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ తాజాగా విడుదల చేసిన ప్రోమోతో ఒక క్లారిటీ ఇచ్చాడు. అనారోగ్యంతో జెస్సీ ఇంటి నుండి బయటికి పంపుతున్నట్లు బిగ్ బాస్ ప్రకటించడంతో ఆ విష్యం తెలిసిన ఇంటి సభ్యులు ఒక్కసారిగా షాక్ అవడం ప్రోమోలో చూశాము.

సిరి హనుమంత్ తో పాటు శన్ముఖ్ జస్వంత్ ఇద్దరు కంటతడి పెట్టుకోవడం.. మిస్ యూ అంటూ జెస్సీ అనడం ఇంటి సభ్యులకు కూడా బాధని కలిగించింది. అయితే ఇలా అనుకోకుండా జెస్సీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోచ్చని అనుకున్న.. ఒకవేళ జెస్సీకి వైద్యుడి పర్యవేక్షణలో ఏదైనా సీక్రెట్ రూమ్ లో ఒకటి రెండు రోజులు ఉంచి అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకున్న పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు.

అయితే మొత్తానికి ఈ వారం జెస్సీ కనుక ఇంటిని వదిలి వెళ్ళిపోతే మాత్రం దాదాపుగా ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. అలా అని మీ అభిమాన కంటేస్టంట్ కి మాత్రం ఓటు వేయడం ఆపకండి.. మరిచిపోకండి.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story