Bigg Boss 5 Promo: రెచ్చగొట్టి పంపుతారు.. వెర్రి పుష్పం చేస్తారంటున్న సన్నీ

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గురువారం ప్రోమో విడుదల

Sandeep Reddy
Updated on: 18 Nov 2021 5:29 PM IST
Bigg Boss Telugu 5 Thursday Episode Promo Released Today 18th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 Promo(ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గురువారం ప్రోమో తాజాగా విడుదలైంది. కెప్టెన్సీ పోటీలో భాగంగా జరుగుతున్న టాస్క్ లో భాగంగా బుధవారం ఎపిసోడ్ లో కెప్టెన్ రవికి విజే సన్నీతో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకొని పవర్ రూమ్ వెళ్ళిన రవి తనకి వచ్చిన పవర్ టూల్ ని సన్నీకి ఇచ్చి వారి మధ్య ఉన్న భేధాభిప్రాయలను ముగించుకోవాలని రవి అనగా సన్నీ మాత్రం ఆ టూల్ ని తీసుకోవడానికి ససేమిరా అంటాడు. అయితే ఇంటి సభ్యులందరూ ఒత్తిడితో సన్నీ ఆ పవర్ టూల్ ని తీసుకుంటాడు. అంతకు ముందు శ్రీరామచంద్ర, రవి, ఆనీ మాస్టర్ టాస్క్ గురించి మాట్లాడుకోవడం ప్రోమోలో చూశాము.

ఇక ప్రోమో చివరికి విజే సన్నీ..స్ట్రిక్ట్ సంచాలక్ కూడా రవిలా చేయడని.. రవి ఎందుకు ఇంత బిల్డప్ చేస్తున్నాడో అర్ధంకావట్లేదని.. నన్ను అనవసరంగా రెచ్చగొట్టి పంపుతారు చివరికి నన్ను వెర్రి పుష్పాన్ని చేస్తారన్నాడు.. ఎందుకంటే నేను పూర్ బాయ్ అంటూ కామెంట్ చేశాడు. ఇక అంతకు ముందు ప్రోమోలో కాజల్ ని విజే సన్నీ తన వెంట తోకలా ఎందుకు వస్తున్నావంటూ అనడం అందుకు కాజల్ హర్ట్ అయి బాధపడటం ఈరోజు ఎపిసోడ్ లో చూడనున్నాం. సన్నీ మాట్లాడుతూ తాను ప్రతి టాస్క్ వ్యక్తిగతంగానే ఆడుతున్నానని.. ఇక నుండి ఎవరైనా గ్రూప్ ఆడుతున్నాము అంటే అప్పుడు చెప్తానని అంటాడు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story