Bigg Boss 5 Promo: ప్రశ్న నాది.. సమాధానం మీది.. ఫన్ డే గా సండే ఎపిసోడ్

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 వీకెండ్ ప్రోమో విడుదల

Sandeep Reddy
Updated on: 21 Nov 2021 3:44 PM IST
Bigg Boss Telugu 5 Sunday Weekend Episode Promo Released Today 21th November 2021 | Bigg Boss 5 Updates
X

బిగ్ బాస్ సీజన్ 5(ఫోటో: స్టార్ మా) 

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఆదివారం ప్రోమో విడుదల అయింది. సన్ డే.. ఫన్ డే మాత్రమే కాదు ఎలిమినేషన్ డే కూడా అంటూ నాగార్జున ఇంటి సభ్యులకు డైలాగ్ చెప్తూ ఎపిసోడ్ మొదట్లోనే సెటైర్ వేశాడు. ఇక ఇంటి సభ్యులు తమ తోటి ఇంటి సభ్యులను అడగాలనుకున్న ప్రశ్నలను నాగార్జున ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ గేమ్ లో భాగంగా మొదట శన్ముఖ్ జస్వంత్ ని హౌస్ లో ఫిజికల్ టాస్క్ అనగానే సన్నీ వైపు చూస్తావ్ ఎందుకని అంటూ నాగార్జున ప్రశ్నిస్తాడు. ఆ తరువాత మానస్ ని ప్రియాంక సింగ్ తో ఫ్యూచర్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందని అడిగిన ప్రశ్నకి "ఫ్రెండ్" అని మానస్ సమాధానం చెబుతాడు.

ఇక ప్రియాంక సింగ్ ని మానస్ నుండి ఏమి ఆశిస్తున్నావని అడిగిన ప్రశ్నకి పింకీ.. ఈ ప్రశ్న ఎవరు అడిగారని నాగార్జునని కోరగా ఆ ప్రశ్న మానస్ అడగమన్నాడని చెబుతాడు నాగ్. ఇక వంట చేసే సమయంలో, రెడీ అయ్యే సమయంలోనే బుర్ర వాడుతారా..? అని ఆనీ మాస్టర్ ని అడగడంతో ఆమె షాక్ అవుతుంది. లేదు సర్ అంటూ ఆమె సమాధానం చెప్తున్న సమయంలో నాగార్జున.. బుర్ర లేదా అంటూ ఆనీ మాస్టర్ కి కౌంటర్ ఇస్తాడు. ఇక కరోనా టైం అంటూ ఇంటి సభ్యులకు కషాయం తాగుమని చెప్పి నాగార్జున ఇంటి సభ్యులను మరిన్ని ఇరుకున పెట్టె ప్రశ్నలను అడిగేలా ఉన్నాడని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story