Bigg Boss 5 Promo: మరోసారి మండే నామినేషన్స్ లో మాటల యుద్ధం తప్పదా..!?

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సోమవారం నామినేషన్ ప్రక్రియ ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 15 Nov 2021 1:44 PM IST
Bigg Boss Telugu 5 Sunday Episode Promo Today 15th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 Promo: ఈ వారం నామినేషన్ లో అందరూ ఉన్నట్టేనా..!?

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సోమవారం నామినేషన్ ప్రక్రియకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ వారం నామినేషన్ లో భాగంగా నిజాలను నిర్భయంగా చెప్పి తమకి నచ్చని ఇద్దరు ఇంటి సభ్యులను ఏ కారణం చేత నామినేట్ చేస్తున్నారో చెప్పి అక్కడ ఉన్న బాటిల్ లోని స్లైస్ ని వారి తలపై పోయాలని బిగ్ బాస్ చెప్తాడు. అయితే నామినేషన్ లో భాగంగా కెప్టెన్ రవి.. విజే సన్నీతో పాటు ఆర్జే కాజల్ ని నామినేట్ చేసినట్టు ప్రోమోలో తెలుస్తుంది. అనవసరంగా గొడవలు పడి నోరు జారుతున్నావని సన్నీని.., సన్నీ గొడవ పడుతున్న సమయంలో ఒక ఫ్రెండ్ గా అతన్ని ఆపకుండా మరింత రెచ్చగోట్టేలా చేస్తున్నావని కాజల్ ని రవి నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఆ తరువాత మానస్.. శన్ముఖ్ జస్వంత్ తో మాట్లాడుతూ సన్నీ విషయంలో ఫిజికల్ అయ్యాడని ఒకసారి, ఫిజికల్ అవుతాడేమో మరోసారి చెప్పడం కరెక్ట్ కాదని, మాట్లాదాటం కోట్లాడటం రెండు వేరు వేరు అని అవి రెండింటిని కలుపోద్దని మానస్ అంటుండగానే శన్ముఖ్ అంటే తిడితే ఓకే అంటావా అంటూ ప్రశ్నిస్తాడు. శన్ముఖ్ జస్వంత్ తన మొదటి నామినేషన్ కాజల్ ని ఎంపిక చేసుకొని తను ఇంటి నుండి బయటికి వెళ్తే హౌస్ లో గొడవలు తగ్గుతాయని నా అభిప్రాయం అంటూ నామినేట్ చేశాడు. ఇక గత వారం నామినేషన్ మాదిరిగానే ఈ వారం కూడా కెప్టెన్ రవి మినహా ఇంటి సభ్యులు అందరూ నామినేట్ అయ్యే అవకాలున్నాయి.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story