Bigg Boss 5 Highlights: జెస్సీ అవుట్.. కాజల్, మానస్ సేఫ్

Sandeep Reddy
Updated on: 16 Nov 2021 12:59 PM IST
Bigg Boss Telugu 5 Sunday Episode Highlights Today 14th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఆదివారం ఎపిసోడ్ లో భాగంగా ఇంటి సభ్యులను రెండు జట్లుగా విడతీసి సరదాగా ఆటలు ఆడించాడు. మొదటగా బిగ్ బాస్ 4 సీజన్ కంటెస్టంట్ గంగవ్వ సొంత ఇంటి కల నెరవేరిందని నాగార్జున ఇంటి సభ్యులకు చెబుతూ వీడియోని చూపించాడు. రెండు టీమ్స్ గా విభజించిన నాగార్జున టీమ్‌ Aలో విజే సన్నీ, శణ్ముఖ్ జస్వంత్, ఆనీ మాస్టర్, ప్రియాంక‌ ఉండ‌గా మిగిలిన‌ ఇంటి సభ్యులు రవి, సిరి హనుమంత్, ఆర్జే కాజల్, శ్రీరామచంద్ర టీమ్‌ B లో ఉన్నారు. సంచాలకుడిగా మాన‌స్ వ్య‌వ‌హ‌రించాడు.

ఆ తరువాత ఐస్, వాటర్, ఫైర్ గేమ్ లో టీమ్‌ A నుండి సన్నీ విజేతగా నిలువగా ఓడిపోయిన ఇంటి సభ్యులకు నాగార్జున.. సిరి హనుమంత్ ఒంటి కాలి మీద నిలబడటం, రవికి గోడ కుర్చీ వేపించడం, ప్రియాంక సింగ్ ని స్టాండ్ అప్ ఆన్ బెంచ్ అంటూ పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ తరువాత కొన్ని మెడ‌ల్స్‌ను ఆ పదాలకు స‌రిగ్గా స‌రిపోయే వ్య‌క్తికి వేయాల‌న్నాడు. మొదటగా విజే స‌న్నీ.. రవికి ఫేక్ అన్న మెడ‌ల్‌ను వేశాడు. మాన‌స్‌.. ప్రియాంక సింగ్ త‌న‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ని మానస్ ఆ మెడల్ వేశాడు. శ్రీరామచంద్ర టాస్క్ లు ఆడేటప్పుడు కాజ‌ల్ క‌న్నింగ్ అని చెప్పాడు.

ఈ వారం నామినేషన్ లో చివరికి డేంజర్ జోన్ లో ఉన్న మానస్, కాజల్ ఇద్దరినీ నాగార్జున ఈ వారం ఎలిమినేషన్ నుండి సేఫ్ అని ప్రకటిస్తూ సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీ ఆరోగ్యం బాగాలేనందున అతడిని ఇంటికి పంపిస్తున్నట్లు నాగార్జున ప్రకటించాడు. ఆ తరువాత స్టేజి మీదకు వచ్చిన జెస్సీ తన బిగ్ బాస్ జర్నీ వీడియో చూసి కన్నీరు పెట్టుకున్నాడు. ఆ తరువాత ఇంటి సభ్యులతో ల్యాండ్ లైన్ లో మాట్లాడిన జెస్సీ.. సన్నీ ని కొంతమంది వాడుకుంటున్నారని, మానస్ సైలెంట్ కిల్లర్ అని, కాజల్ ని ఇతరులకు హెల్ప్ చేయడం మాని తన జెమ్ ఆడాలని చెప్పాడు. ఆ తరువాత ఆనీ మాస్టర్ ఫైటర్ అని, ప్రియాంక సింగ్ ఇతరుల కోసం త్యాగాలు చేయడం మానాలని చెప్పాడు. చివరకు రవి తన గేమ్ బాగా ఆడుతున్నాడని, శన్ముఖ్ జస్వంత్ ని ఫైనల్ లో కలుస్తానని తెలిపాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story