BB5: ఆవేశపడకు రామచంద్ర..!! కెప్టెన్సీ టాస్క్ ని తమ వైపు లాక్కున్న సన్నీ టీం

*బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Updated on: 7 Oct 2021 12:46 PM IST
Bigg Boss Telugu 5 Season 06th October 2021 Episode Highlights | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu: (Photo: Star Maa)

BB5 Updates: సన్నీ ప్రజాస్.. రవి ప్రజాస్ లకు బిగ్ బాస్ ఇచ్చిన బుధవారం ఎపిసోడ్ లో కుస్తీ టాస్క్ లలో భాగంగా సన్నీ టీం నుండి మానస్, జెస్సీ, ప్రియాంకలను.. రవి టీం నుండి విశ్వా, ఆని మాస్టర్, శ్వేతవర్మలను ఆయా ఎంపిక చేసుకున్నారు. మొదట కుస్తీ టాస్క్ లో భాగంగా విశ్వాతో మానస్ పోటీపడి ఓడిపోగా, ఆతరువాతి టాస్క్ లో ఆని మాస్టర్ పై జెస్సీ.. ప్రియాంకసింగ్ పై శ్వేతవర్మలు గెలుపొందారు.

తన టీంలో అమ్మాయిలు లేని కారణంగా జెస్సిని ఎంపిక చేశామని.. రవి టీం నుండి శ్రీరామచంద్ర, రవి టాస్క్ లో పాల్గొనే అవకాశం ఉన్నా కూడా ఏవో కారణాలతో ఆని మాస్టర్ ని ఆ టాస్క్ ఆడించడంపై అటు సన్నీ టీంకి ఇష్టం లేకున్నా టాస్క్ పూర్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకు ముందు నాణేలను దొంగిలించారని విశ్వా సన్నీ టీం పైకి ఫైర్ అవడంతో మానస్ కి విశ్వాకి మధ్య మాటల యుద్ధం జరిగింది.

మరోవైపు తమకి సపోర్ట్ చేయాలనీ ఒకవైపు సన్నీ మరోవైపు రవి ఇంటి సభ్యులను అడగడం..ఇంటి సభ్యులు వారికి కావాల్సిన నాణేలను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన మరొక టాస్క్ లో భాగంగా ఖాళీ స్లాట్స్ తో ఉన్న రెండు వాల్స్ పై ఇంటి సభ్యులు ఎవరైతే ఏ రాజుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ రాజు ఫోటోని ఆ స్లాట్ లో పెట్టాల్సి ఉంటుంది. ఇంటి సభ్యులు ఎవరైతే తన రాజును ఉనికిని కాపాడటానికి ఎదుటి రాజు ఫోటోలను స్లాట్ నుండి తొలగించే అవకాశం కూడా బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది.

ఈ టాస్క్ లో సన్నీ తరపున జెస్సి, మానస్.., రవి తరపున విశ్వా, శ్రీరామచంద్రలు గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. ఈ గేమ్ లో శ్రీరామచంద్ర రూల్స్ బ్రేక్ చేస్తూ బోర్డుని పడేసిన చివరికి సన్నీ టీం ఈ టాస్క్ లో విజేతగా నిలిచారు. ఆ తరువాత ఇంటి సభ్యులు ఎవరి స్ట్రాటేజి వాళ్ళు ఉపయోగిస్తూ నాణేలను దొంగిలించడం జరిగింది. చివరగా లాక్కో లాక్కో టాస్క్ లో భాగంగా సన్నీ టీంలో జెస్సి, మానస్, శన్ముఖ్, సిరి, ప్రియాంక, లోబోలు, రవి టీం నుండి శ్రీరామ్, ప్రియ, విశ్వాలు పార్టిసిపేట్ చేయగా ఈ టాస్క్ సన్నీ టీం విజయం సాధించి కెప్టెన్సీ టాస్క్ లో ముందంజలో నిలిచారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story