Bigg Boss 5 Promo: "సన్నీ".. ది ఎంటర్టైనర్ ఆఫ్ ది బిగ్ బాస్

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 శనివారం(20/11/2021) ప్రోమో విడుదల

Sandeep Reddy
Updated on: 20 Nov 2021 12:51 PM IST
Bigg Boss Telugu 5 Saturday Episode Promo Released Today 20th November 2021 | Bigg Boss 5 Updates
X

బిగ్ బాస్ సీజన్ 5 (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 శనివారం ప్రోమోలో భాగంగా ఇంటి సభ్యులు ఎలిమినేషన్ నుండి బయటపడటానికి బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం "నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా" టాస్క్ లో చివరికి ఆనీ మాస్టర్, సిరి హనుమంత్, విజే సన్నీ మిగిలిన సంగతి తెలిసిందే. అయితే చివర్లో ఫైర్ ట్రక్ ఎక్కినా మానస్, ఆర్జే కాజల్ లో ఒకరు సిరిని సేవ్ చేయాలని అనడం, మరొకరు ఆనీ మాస్టర్ ని సేవ్ చేయాలని అనడంతో కాసేపు వారిద్దరి మధ్య చర్చ జరుగుతుంది.ఒక సందర్భంలో ఆర్జే కాజల్ తన ఫ్రెండ్ సన్నీ కోసం ఎవరిని సేవ్ చెయ్యొద్దు అని చెప్తుంది.

అలా చేస్తే చివరికి విజె సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కుతుందని కాజల్ అనడంతో మానస్ ఫేర్ గేమ్ ఆడుదామని అలా చెయ్యొద్దు అంటూ చెప్పడం ప్రోమోలో చూశాము. అయితే ఆనీ మాస్టర్ మాత్రం తొండి గేమ్ ఆడుతున్నారని, అంత యాక్టింగ్ అంటూ అరవడాన్ని బట్టి చూస్తుంటే కాజల్ అనుకున్నట్లుగానే ఆనీ మాస్టర్, సిరి హనుమంత్ లలో ఇద్దరినీ సేవ్ చేయలేదన్నట్లుగా కనిపిస్తుంది. అదే విషయంపై ప్రియాంక సింగ్ తో గొడవ పడినట్లు తెలుస్తుంది. తానేమి తక్కువ అన్నట్లు ప్రియాంక కూడా ఆనీ మాస్టర్ పైకి ఫైర్ అవడం మధ్యలో విజే సన్నీ ఆపడంతో చేయి తీయ్ అంటూ కోపంగా మాట్లాడటం అందుకు సన్నీ నవ్వడంతో పాటు "మాస్టర్" సినిమాలో వాతి కామింగ్ పాట పాడుతూ డాన్స్ చేయడం ప్రోమోలో హైలైట్ గా నిలిచింది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story