BB5 Highlights: నువ్వు గ్రూప్ అయితే ఆ గ్రూప్ కి లీడర్ నేనే.. సన్నీ మాస్ డైలాగ్

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు 11వ వారం నామినేషన్ ప్రక్రియ హైలైట్స్

Sandeep Reddy
Published on: 23 Nov 2021 11:43 AM IST
Bigg Boss Telugu Season 5 Monday Episode Highlights Today 22nd November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు 11వ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఇంటి సభ్యుల దిష్టిబొమ్మలను పగలగొట్టాల్సి ఉంటుంది. ఇక ఈ నామినేషన్ ప్రక్రియని మొదటగా ప్రారంభించిన రవి.. విజే సన్నీ ఇంట్లో తన పనులను సరిగ్గా నిర్వర్తించలేదని అతన్ని నామినేట్ చేశాడు. ఆ తరువాత ఆర్జే కాజల్ ని నామినేట్ చేశాడు. ప్రియాంక సింగ్.. శన్ముఖ్ జస్వంత్ గత రెండు వారాలుగా ఆట సరిగ్గా అడట్లేదని అంతేకాకుండా తనని అంతకు ముందు నామినేట్ చేసినందుకే ఈ వారం శన్ముఖ్ జస్వంత్ ని నామినేట్ చేస్తున్నానని చెప్తూ నామినేట్ చేసింది.

ఇక సిరి హనుమంత్ కూడా నామినేట్ చేస్తూ ఆమెతో చిన్నపాటి గొడవ పెట్టుకుంది పింకీ. శన్ముఖ్ జస్వంత్.. రవి సంచాలక్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా తన పని సరిగ్గా చేయలేదని అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్తూ కుండ బద్ధలుకొడుతాడు. సిరి హనుమంత్ తో నేను ప్లాన్ చేసుకొని వచ్చారా అని సండే ఎపిసోడ్ లో ఆర్ జే కాజల్ అడిగిన ప్రశ్న తనకి నచ్చలేదంటూ కాజల్ ని నామినేట్ చేశాడు శన్ముఖ్ జస్వంత్. అప్పటి వరకు కాస్త ప్రశాంతంగా సాగిన నామినేషన్ ప్రక్రియ శ్రీరామ్ రాకతో వాడివేడిగా సాగింది. తాను కెప్టెన్సీ పోటీదారులలో లేకుండా సన్నీ చేశాడనే కారణంతో అతడిని నామినేట్ చేశాడు.

వీరిద్దరి నామినేషన్ సమయంలో బిగ్ బాస్ లో గ్రూప్ లు గా ఎవరు ఆడుతున్నారో తెలుసని సన్నీ అనగానే ఆవేశానికి గురైన శ్రీరామ్ అవును నేను 5 కోట్ల మంది తెలుగు ప్రజల గ్రూప్ అనగానే సన్నీ నవ్వుతూనే నేనే ఆ గ్రూప్ కి లీడర్ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక తాను మాట్లాడినప్పుడు ఆవేశంలో ఉండటంతో పాటు ఎదుటివాళ్ళు చెప్పేది కూడా వినకుండా మాటల మధ్యలో దూరడంతో చేసే అతి బుల్లితెర ప్రేక్షకులకు కాస్త చిరాకు తెప్పించింది. ఆ తరువాత కాజల్ తో కూడా ఫైర్ హౌస్ టాస్క్ గురించి మాట్లాడుతూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్‌లో అందరి కంటే రవి ఫేక్‌ అంటూ నామినేట్‌ చేశాడు సన్నీ. ఇక హౌస్‌ నుంచి వెళ్లిపోయిన ఆనీ మాస్టర్‌ కోసం వీజే సన్నీ, శ్రీరామ్‌ గొడవపడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు నానా మాటలు అనుకున్నారు.

అనంతరం సిరి హనుమంత్ మాట్లాడుతూ నా వెనకాల మాట్లాడొద్దంటూ పింకీని, రవిని నామినేట్‌ చేసింది. బిగ్ బాస్ ఇంట్లో నాకు ఇష్టం లేని వ్యక్తి రవిని ఒక్కడేనంటూ నామినేట్‌ చేసింది కాజల్‌. ఆనీ మాస్టర్‌ విషయంలో ఉసురు పోసుకోవడం అని మాట్లాడటం ఏంటని ఇది బిగ్ బాస్ హౌస్ అని అలాంటివి ఇక్కడ మాట్లాడటం నచ్చలేదని శ్రీరామ్‌ కుండ పగలగొట్టింది కాజల్. ఆ తర్వాత కెప్టెన్‌ మానస్‌.. శ్రీరామ్‌, రవిని నామినేట్‌ చేశాడు.ఇక నామినేషన్ ప్రక్రియలో సన్నీ - శ్రీరామ్, రవి - సన్నీ మధ్య జరిగిన మాటల యుద్ధం సోమవారం నామినేషన్ ప్రక్రియలో హైలైట్ గా నిలిచింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story