Bigg Boss 5 Promo: నిప్పుల్లో కాలేది ఎవరు..? గుండెల్లో నిలిచేది ఎవరు..?

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 శుక్రవారం(19/11/2021) ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 19 Nov 2021 3:44 PM IST
Bigg Boss Telugu 5 Friday Episode Promo Released Today 19th November 2021 | Bigg Boss 5 Updates
X

బిగ్ బాస్  5 ప్రోమో(ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 శుక్రవారం ప్రోమో తాజాగా విడుదలైంది. ఎలిమినేషన్ నుండి బయటపడటానికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు "నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా" టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ లో భాగంగా ఎవరైతే ఫైర్ అలారం మోగగానే ఫైర్ ఇంజన్ వాహనంలోకి వెళ్తారో వారు బర్నింగ్ హౌస్ లో ఉన్న ఇద్దరు ఇంటి సభ్యుల నుండి ఎవరిని సేవ్ చేస్తారో.., ఎవరిని మంటల్లో కాలిపోనిస్తారో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చివరి వరకు ఏ ఇంటి సభ్యుడి ఫోటో అయితే బర్న్ హౌస్ లో మంటల్లో కాలిపోకుండా చివరి వరకు ఉంటుందో ఆ ఇంటి సభ్యుడికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ లభిస్తుందని బిగ్ బాస్ నియమాన్ని పెడుతాడు.

విజె సన్నీ, ప్రియాంక సింగ్

శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్

మానస్, శ్రీరామచంద్ర

రవి, ఆనీ మాస్టర్ ఫోటోలు జంటగా బర్నింగ్ హౌస్ లో ఉండటం ప్రోమోలో చూడవచ్చు. ఇక మొదటగా శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ ఫైర్ ఇంజన్ వెహికల్ ఎక్కడం వారిద్దరికీ సన్నీ, ప్రియాంక సింగ్ ఫోటోలు రావడంతో సన్నీ, ప్రియాంక సింగ్ ఇద్దరు వారి పద్దతిలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కావాలని సిరి, శన్ముఖ్ లను రిక్వెస్ట్ చేయడం ప్రోమోలో చూడవచ్చు. ఆ తరువాత శ్రీరామచంద్ర, ఆనీ మాస్టర్ ఇద్దరు ఫైర్ ఇంజిన్ వాహనం ఎక్కగా వారికి శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ ఫోటోలు రావడం వారు ప్రేక్షకుల ఓట్లు తమకి ముఖ్యమని వారి వల్లే ఇక్కడ ఉన్నామని చెప్పడం చూడవచ్చు. మరి ఇంటి సభ్యుల్లో ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరు సాధించి ఎలిమినేషన్ నుండి బయటపడుతారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story