Bigg Boss 5 Highlights: సిరి యాక్షన్.. సన్నీ రియాక్షన్.. శన్ముఖ్ ఓవర్ యాక్షన్

* "అప్పడం" కోసం ఎంత వరకైనా వెళ్తానంటున్న శన్ముఖ్ జస్వంత్

Sandeep Reddy
Updated on: 15 Nov 2021 12:23 PM IST
Bigg Boss Telugu 5 Friday Episode Highlights Today 12th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 Highlights: సిరి యాక్షన్.. సన్నీ రియాక్షన్.. శన్ముఖ్ ఓవర్ యాక్షన్

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 శుక్రవారం ఎపిసోడ్ ఇంటి సభ్యుల మధ్య గొడవలతో హాట్ హాట్ గా సాగింది. బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన బిబి టాస్క్ లో భాగంగా ఆర్జే కాజల్ దగ్గర దొంగిలించిన డబ్బును రవి తిరిగి ఇచ్చేశాడు. విజే సన్నీని ఎత్తుకొని తిరిగిన ఆనీ మాస్టర్ కి టిప్ ఇవ్వగా టాస్క్ పూర్తయ్యే సమయానికి హోటల్ సిబ్బంది బిగ్ బాస్ చెప్పినట్టుగా అతిధుల నుండి 15 వేల రూపాయలు రాబట్టనందున అతిధుల టీంని బిగ్ బాస్ విజేతలుగా ప్రకటించాడు. బిబి హోటల్ లో ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌ ను విజయవంతంగా పూర్తి చేసిన రవిని కెప్టెన్సీ పోటీదారుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్‌.

అయితే హోటల్ సిబ్బంది ప్రదర్శన కూడా బాగుందని చెప్పిన బిగ్ బాస్..అతిధుల టీం నుండి ఏ ఇద్దరినైనా కెప్టెన్సీ పోటీ నుండి తప్పించే పవర్ ఇవ్వడంతో శన్ముఖ్ జస్వంత్, శ్రీరామచంద్ర, రవి, ఆనీ మాస్టర్ ఏకాభిప్రాయంతో అతిధుల టీం నుండి మానస్, ప్రియాంక సింగ్ ని ఎంచుకుంటారు. ఇక చివరగా కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన విజే సన్నీ, రవి, సిరి హనుమంత్, ఆర్జే కాజల్ టవర్ లో ఉంది పవర్ టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్ లో మొదటి రౌండ్ లో ఆర్జే కాజల్ ఓడిపోయి పోటీ నుండి తప్పుకుంది.

ఆ తరువాత సిరి హనుమంత్ ఆమె గేమ్ ఆడకుండా విజే సన్నీని ఆడకుండా అడ్డుకోవడంతో ఆమెపై సన్నీ సీరియస్ అయ్యాడు. తనని ఆట అడనివ్వకుండా ఇలాగే చేస్తే నీ టవర్ ని తంతా అని చెప్పిన సన్నీ, ఇలా తనపైనకి రావడం కరెక్ట్ కాదని తాను పక్కన తోస్తే అప్పడం అయిపోతావని అంటాడు. ఇలా వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో శన్ముఖ్ జస్వంత్ మధ్యలో మాట్లాడుతూ సన్నీని మరింత రెచ్చగొట్టాడు. దీంతో సీరియస్ అయిన సన్నీ.. శన్ముఖ్ జస్వంత్ కి తనదైన స్టైల్ లోనే కౌంటర్ ఇచ్చాడు.

ఒకపక్క సన్నీ ఒక్కడే మాట్లాడుతుండగా మరోపక్క మాత్రం సిరి హనుమంత్, శన్ముఖ్ జస్వంత్ ఇద్దరు సన్నీపై అరవడం మొదలు పెట్టారు. అప్పటికి నాగార్జునకి ఇచ్చిన మాట వల్ల తాను ఏమి అనట్లేదని సన్నీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. తనని అప్పడం చేస్తా అని ఎలా అంటావ్.. అప్పడం అంటే నేను ఎంత వరకైనా వెళ్తానని, చెయ్యు చూస్తా అప్పడం అంటూ శన్ముఖ్ జస్వంత్ సన్నీతో అన్నాడు. అయితే ఆ సందర్భంలో సన్నీ ఒక్కసారి అన్న అప్పడానికి శన్ముఖ్ జస్వంత్ మొత్తం ఎపిసోడ్ ని అప్పడంలా మార్చినట్టు కనిపించింది.

నామినేషన్ సమయంలో ప్రియాంక సింగ్ సిగ్గు ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి అని శన్ముఖ్ జస్వంత్ ని అన్నప్పుడు రాని కోపం సిరి హనుమంత్ ని అప్పడం అన్నప్పుడు ఎందుకు వచ్చిందోనని బుల్లితెర ప్రేక్షకులకు అర్ధంకాలేదు. మరోపక్క కాజల్ ఆనీ మాస్టర్ ఒకరిపై ఒకరు అరుచుకోవడం.. ఆనీ మాస్టర్ నాగిని డాన్స్ చేస్తూ కాజల్ ని రెచ్చగొట్టడం జరిగింది. ఇక చివరికి మానస్, సన్నీ ఇద్దరు మాట్లాడుకుంటూ ప్రియాంక సింగ్ కావాలనే రెండు సార్లు టవర్ కూల్చిందని మాట్లాడుకున్నారు. చివరగా టవర్ లో ఉంది పవర్ కెప్టెన్సీ టాస్క్ లో రవి గెలిచి ఇంటి కెప్టెన్ గా నిలుస్తాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story