Bigg Boss 5 Promo: జెస్సీ వద్దంటే కెప్టెన్సీ పోటీలో నిలిచేదేవరు..?

* తాజాగా విడుదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బుధవారం ప్రోమో

Sandeep Reddy
Published on: 27 Oct 2021 4:32 PM IST
Bigg Boss Season 5 Telugu Wednesday Latest Promo Released 27th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 బుధవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో అభయహస్తం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గెలుపొందిన ముగ్గురు ఇంటి సభ్యులు శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్, శ్రీరామచంద్ర ఈవారం కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం ఎపిసోడ్ లో ఎవరి రంగు ఎక్కువ పడింది అనే టాస్క్ ఆనీ మాస్టర్, ప్రియాంక సింగ్ మధ్య జరిగినట్టుగా తాజా ప్రోమోతో తెలుస్తుంది.

ఈ టాస్క్ లో ప్రియాంక సింగ్ పై ఆనీ మాస్టర్ గెలుపొందినట్లు తెలుస్తుంది. ఇంటి సభ్యుల మధ్య కెప్టెన్సీ పోటీదారుల గురించి మాట్లాడుకునే సంభాషణలో మిగిలిన ఇద్దరు కెప్టెన్సీ పోటీదారులలో ఆనీ మాస్టర్, జెస్సీ ఉండగా జెస్సీ తాను కెప్టెన్సీ పోటీదారుడిగా తప్పుకుంటానని చెప్పడంతో ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ కాని ఇంటి సభ్యుడినే హౌస్ మేట్స్ ఎంపిక చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే కెప్టెన్సీ పోటీదారులలో ఉన్న ముగ్గురు ఇంటి సభ్యులు కాకుండా ఆ లిస్టులో మానస్, రవి, ప్రియాంక సింగ్ లు ఉన్నారు. అయితే ఇంట్లో ఇప్పటివరకు మంచి పేరున్న మానస్ ని ప్రియాంక సింగ్ తో పాటు మిగిలిన ఇంటి సభ్యులు కెప్టెన్సీ పోటీదారుడిగా ఒప్పుకునే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈ వారం కెప్టెన్సీలో మానస్, శన్ముఖ్ జస్వంత్ మధ్యే ముఖ్యంగా పోటీ ఉండనుంది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story