Bigg Boss 5 Promo: హీరోస్ - విలన్స్ పోటీలో విజేతలు ఎవరో..!?

* బిగ్ బాస్ 5 తెలుగు బుధవారం ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 3 Nov 2021 4:19 PM IST
Bigg Boss Season 5 Telugu Wednesday Episode Second Promo 03rd November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 గురువారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈవారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు సూపర్ హీరోస్, సూపర్ విలన్స్ ల రెండు గ్రూపులుగా విడిపోయి టాస్క్ లో పాల్గొంటారు. సూపర్ హీరోస్ మానస్, శ్రీరామచంద్ర, కాజల్, శన్ముఖ్ జస్వంత్, ప్రియాంక సింగ్ లు ఉండగా, సూపర్ విలన్స్ టీంలో రవి, విజే సన్నీ, విశ్వా, ఆనీ మాస్టర్, జెస్సీ, సిరి హనుమంత్ లు ఉండటం ప్రోమోలో చూశాము.

ఇక సూపర్ విలన్స్ టీం సభ్యులు సూపర్ హీరోస్ లోని శ్రీరామచంద్రని, సూపర్ విలన్స్ టీం నుండి హీరోస్ సభ్యులు రవిని టార్గెట్ చేసి టాస్క్ లో భాగంగా రకరకాలుగా ఇబ్బందిపెట్టడం ప్రోమోలో చూశాము. ప్రోమోలో చూసిన ప్రకారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో సూపర్ విలన్స్ నుండి రవి, సూపర్ హీరోస్ నుండి శ్రీరామచంద్ర తమకి ఇచ్చిన టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేసినట్టుగా ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story