Bigg Boss 5 Highlights: ఈవారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా నిలిచేది ఎవరు..!?

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుధవారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Published on: 28 Oct 2021 12:18 PM IST
Bigg Boss Season 5 Telugu Wednesday Episode Highlights 28th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుధవారం ఎపిసోడ్ లో అభయహస్తం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కెప్టెన్ గా పోటీదారులుగా ఎంపిక కోసం రకరకాల టాస్క్ లలో గెలవడానికి ఇంటి సభ్యులు శ్రమించారు. నాలుగో టాస్క్ లో భాగంగా విజే సన్నీ, ఆర్జే కాజల్ పాల్గొనగా ఆ టాస్క్ లో విజే సన్నీ విజేతగా నిలిచి ఈ వారం కెప్టెన్ పోటీదారుడిగా నిలిచాడు. అంతకు ముందు జెస్సీ తాను కూడా కెప్టెన్సీ పోటీలో పాల్గొంటానని మొదట మాట్లాడి చివరికి ఇంటి సభ్యుల మధ్య జరిగిన సంభాషణతో కెప్టెన్సీ పోటీ నుండి తప్పుకున్నాడు.

ఇక ఇంటి సభ్యులలో కెప్టెన్సీ పోటీదారుల కోసం మిగిలిన ఆనీ మాస్టర్, ప్రియాంక సింగ్ లు ఇద్దరు పాల్గొన్న రంగు టాస్క్ లో చివరికి ఆనీ మాస్టర్ విజేతగా నిలిచి అయిదవ కెప్టెన్సీ పోటీదారురాలిగా ఎంపిక అయింది. ఇక టాస్క్ లలో ఓడిపోయిన ఇంటి సభ్యులకు బిగ్ బాస్ చివరి అవకాశంగా ఇచ్చిన టాస్క్ లో మానస్ గెలుపొంది కెప్టెన్ పోటీలో నిలిచాడు. దీంతో ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా శన్ముఖ్ జస్వంత్, శ్రీరామచంద్ర, సిరి హనుమంత్, విజే సన్నీ, ఆనీ మాస్టర్, మానస్ లు నిలిచారు.

అయితే తాజా ప్రోమోలో టాస్క్ లో పాల్గొన్న పోటీదారులలో శ్రీరామచంద్ర, విజే సన్నీకి మధ్య వాగ్వాదం అవడం, శ్రీరామ చంద్ర నీ ఫ్రెండ్ కి సపోర్ట్ చేసావ్ కదా అని మానస్ ని ఉద్దేశించి అనడంతో పాటు వారి బ్యాగ్స్ చూస్తుంటే ఈ టాస్క్ నుండి సన్నీ, శ్రీరామచంద్రలు వైదోలిగినట్టుగా కనిపిస్తుంది. ఇక మిగిలిన ఈ నలుగురి పోటీదారులలో ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ ఇంటి కెప్టెన్ గా శన్ముఖ్ జస్వంత్, మానస్, ఆనీ మాస్టర్ మినహా సిరి హనుమంత్ కెప్టెన్ గా చేసిన సంగతి తెలిసిందే.

కాబట్టి ఈ వారం కెప్టెన్ గా శన్ముఖ్ జస్వంత్, మానస్, ఆనీ మాస్టర్ లలో ఎవరో ఒకరు ఈవారం కెప్టెన్ గా ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ ముగ్గురిలో కూడా నామినేషన్ సమయంలో మానస్, శన్ముఖ్ జస్వంత్ లు ఇద్దరు తమ కుటుంబ సభ్యుల నుండి వచ్చిన లేఖలను వదులుకోవడంతో కెప్టెన్ పోటీలో ఈ ఇద్దరి వైపే ఇంటి సభ్యులు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి ఈరోజు జరగనున్న ఎపిసోడ్ లో ఈ వారం కెప్టెన్ గా ఎంపిక అవుతారో వేచి చూడాల్సిందే..!!

Sandeep Reddy

Sandeep Reddy

Next Story