Bigg Boss 5 Highlights: బిబి హోటల్ టాస్క్ లో ఆకట్టుకున్న సన్నీ, సిరి

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)
Bigg Boss Telugu 5 Updates: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుధవారం ఎపిసోడ్ హైలైట్స్
Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 బుధవారం ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఉంచిన ఒక కేకును తినడానికి "ఇది తినే అర్హుత ఎవరికీ ఉంది???" అనే ప్రశ్నకి సమాధానం దొరకక ఒక రోజంతా తర్జనభర్జన పడిన మొదటగా ఇంటి కెప్టెన్ తానే కాబట్టి ఆ ఫుడ్ తినే అర్హత నాకే ఉందని ఆనీ మాస్టర్ చెప్పినా బిగ్ బాస్ వైపు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైలెంట్ గా వెళ్ళిపోయింది ఆనీ మాస్టర్.
ఇక మరుసటి రోజు ఉదయం మానస్ ని విజే సన్నీ అసలు ఆ కేకు తినకుండా కెప్టెన్ ఆపొచ్చని ఏదైనా రూల్ ఉందారా అని అడగడంతో మానస్ అలాంటిదేమి లేదని చెప్పడంతో సన్నీ ఏదైతే అది అయింది అంటూ వెళ్లి ఆ కేకు తినడంతో మానస్ నవ్వుకోగా ఆనీ మాస్టర్ మాత్రం షాక్ అయింది. ఇక ఆ కేకు తిన్న సన్నీ ఇప్పుడు ఇంటి సభ్యులు ఏమి పంచాయతీ పెడుతారో అంటూ భయపడటం, ఫుడ్ కరాబ్ అయితదని తింటున్న సర్ అని బిగ్ బాస్ కి విజే సన్నీ చెప్పిన మాటలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.
కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ ఇచ్చిన బిబి హోటల్ టాస్క్ లో భాగంగా నోటీస్ పీరియడ్ లో ఉన్న హౌస్ కీపింగ్ స్టాఫ్ గా రవికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వడంతో పాటు వెయిటర్లుగా శన్ముఖ్ జస్వంత్, శ్రీరామచంద్ర, మేనేజర్ కమ్ రిసెప్షనిస్ట్‌గా ఆనీ మాస్టర్, రవి తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న హౌస్ కీపింగ్ గా,
మానస్- ప్రియాంక హనీమూన్ ట్రిప్ కి వచ్చిన కపుల్, హోటల్ యజమానికి బెస్ట్ ఫ్రెండ్ గా కాజల్, విజే సన్నీ మొదటిసారి 5 స్టార్ హోటల్‌కు వచ్చిన అతిథిగా, ఒక డాన్ కూతురుగా సిరి నటించాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో హోటల్ స్టాఫ్ గెస్ట్ ల నుండి ఎవరైతే 15 వేల రూపాయలు గెలిస్తే వారు ఈ టాస్క్ లో విజేతగా నిలుస్తారని బిగ్ బాస్ నియమాన్ని పెడుతాడు.
ఇక ఈ టాస్క్ లో విజే సన్నీ, సిరి హనుమంత్ తమ పాత్రతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. శన్ముఖ్ జస్వంత్ చెప్పిన దాని కంటే అతి చేస్తున్నాడని స్విమ్మింగ్ పూల్ నుండి నీటిని స్పూన్ తో ఒక టీ కప్ లో నింపాడు శన్ముఖ్. ఆ తరువాత శన్ముఖ్ జస్వంత్ టిప్ ఇచ్చింది సిరి హనుమంత్. ఇక కాజల్ బ్యాగులో నుండి డబ్బులు కొట్టేసి తనకు ఏది తెలియనట్టు ఉన్నాడు రవి. మరి ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో టాస్క్ పూర్తయ్యే సరికి ఎవరు ఎక్కువ డబ్బు గెలిచి కెప్టెన్సీ పోటీలో నిలుస్తారో వేచి చూడాల్సిందే.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT