Bigg Boss 5 Highlights: విలన్ టీంలో ఉన్న రవి కెప్టెన్సీ టాస్క్ తో హీరో అయ్యాడుగా..!!

* కెప్టెన్సీ టాస్క్ తో రవికి మంచి రోజులోచ్చాయా..!? * బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుధవారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Published on: 4 Nov 2021 12:44 PM IST
Bigg Boss Season 5 Telugu Wednesday Episode Highlights 03rd November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 గురువారం ఎపిసోడ్ తొమ్మిదో వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ ఇచ్చిన సూపర్ హీరోస్, సూపర్ విలన్స్ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీలో పాల్గొన్నారు. అందులో భాగంగా సూపర్ హీరోస్ టీంలో మానస్, శ్రీరామచంద్ర, కాజల్, శన్ముఖ్ జస్వంత్, ప్రియాంక సింగ్ లు ఉండగా, సూపర్ విలన్స్ టీంలో రవి, విజే సన్నీ, విశ్వా, ఆనీ మాస్టర్, జెస్సీ, సిరి హనుమంత్ లు ఉన్నారు.

మొదటి రౌండ్ లో సూపర్ విలన్స్ టీం సభ్యులు సూపర్ హీరోస్ లోని శ్రీరామచంద్రని ఎంపిక చేసుకుంటారు. సూపర్ విలన్స్ సభ్యులు శ్రీరామచంద్రకి తలపై రంగు పోసుకోవాలని, రకరకాల ఐటమ్స్ తో తయారుచేసిన జ్యూస్ ని తాగమని చెప్పడం, జెస్సీ ట్రీమ్మర్ తో హెయిర్ కట్ చేసుకోమని చెప్తాడు. ఇలా ఇచ్చిన ఛాలెంజ్ లను శ్రీరామచంద్ర విజయవంతంగా పూర్తి చేస్తాడు. ఆ తరువాత రెండో రౌండ్ లో సూపర్ విలన్స్‌ టీంలోని రవిని టార్గెట్‌ చేశారు సూపర్ హీరోస్.

రవి తన దగ్గరున్న బట్టలన్నింటికి పేడ అంటించుకోవాలని శన్ముఖ్ జస్వంత్ చెప్పాడు. మళ్ళీ శన్ముఖ్ కి జాలేసి కేవలం రవి ధరించిన బట్టలకు మాత్రమే పేడ అంటించుకోమని చెప్తాడు. అలాగే కొన్ని ఐటమ్స్ తో మిక్స్‌ చేసిన జ్యూస్‌ను తాగాలని చెప్పారు సూపర్ హీరోస్ టీం. ఆ వెంటనే స్క్వాడ్స్‌ చేయాలన్నారు. అయితే ఈ కెప్టెన్సీ టాస్క్ లో రవి సూపర్ హీరోస్ ఇచ్చిన ప్రతి ఛాలెంజ్ కు వెనకడుగు వేయకుండా, తన వెన్నునొప్పిని కూడా పక్కనపెట్టి అన్ని ఛాలెంజ్ లను విజయవంతంగా రవి పూర్తి చేశాడు. మరోసారి జ్యూస్‌ ఇవ్వగా దాన్ని కూడా తాగేశాడు.

రవికి బ్యాక్‌ ప్రాబ్లమ్‌ ఉందని తెలిసినా అలాంటి కష్టతరమైన టాస్కులు ఇవ్వడం సరైనది కాదని చెప్పిన ఆనీ మాస్టర్ మళ్ళీ ఇవే టాస్క్ లు మీకే ఇస్తానని చెప్పింది. అప్పటికి లెక్క చేయని సూపర్ విలన్లు రవిని గుండ్రంగా తిరగమని చెప్పారు. ఆ తరువాత జ్యూస్‌ను తాగమని చెప్పడంతో రవి వెంటనే తాగాడు. అది పూర్తి అయిన వెంటనే మరో జ్యూస్ ని తాగమని విలన్స్ చెప్పడంతో రవి బాగోలేదని ఇబ్బంది పడుతూనే తాగాడు. తన జట్టును గెలిపించడం కోసం పోరాడి ఇన్ని రోజులుగా రవి తనపై ఉన్న జనాల్లో కొంత నెగిటివ్ ఫీలింగ్ ని కెప్టెన్సీ టాస్క్ తో పోగొట్టుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story