BB5 Promo: బిగ్ బాస్ హౌస్ లో లాక్ డౌన్.. టాస్క్ గెలిచి ఇంట్లోకి వెళ్లేదేవరు.?

*కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో లాక్ డౌన్

Sandeep Reddy
Published on: 26 Oct 2021 1:45 PM IST
Bigg Boss Season 5 Telugu Tuesday Promo 26th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Latest Promo: బిగ్ బాస్ సీజన్ 5 మంగళవారం ఎపిసోడ్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు. నామినేషన్ ప్రక్రియలో లెటర్స్ ని పొందలేని ఇంటి సభ్యులు తమ మనసులో బాధతో యుద్ధం చేయగా మంగళవారం జరగనున్న అభయ హస్తం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో లాక్ డౌన్ విధిస్తున్నామని, అభయ హస్తం టాస్క్ లో గెలిచే ఇంటి సభ్యుడే హౌస్ లోకి వెళ్తారని బిగ్ బాస్ నియమాన్ని ఉంచుతాడు.

ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా మొదట శన్ముఖ్ జస్వంత్, లోబోలు ఆడుతున్న గేమ్ కి కెప్టెన్ విజే సన్నీ సంచాలక్ గా వ్యవహరించాడు. టాస్క్ జరుగుతున్న సమయంలో విశ్వా, కాజల్ తో పాటు మరికొంతమంది ఇంటిసభ్యులు వారి గేమ్ గురించి మాట్లాడుతుండటంతో విశ్వాపై శన్ముఖ్ జస్వంత్, కాజల్ పై లోబో ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగుతారు. చివరికి ఆ టాస్క్ లో ఎవరు గెలిచారో సంచలాక్ నిర్ణయం తీసుకుంటాడని ఇంటి సభ్యులు ఆ విషయంపై ఎవరు మాట్లాడవద్దని నిర్ణయం తీసుకుంటారు. మరి బిగ్ బాస్ ఇచ్చిన అభయ హస్తం కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి ఎవరు ఈ వారం బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా ఎంపిక అవుతారో వేచిచూడాల్సిందే..!!


Sandeep Reddy

Sandeep Reddy

Next Story