BB5 Highlights: సన్నీ కామెడీతో, ఆనీ - సిరి అరుపులతో మంగళవారం ఎపిసోడ్

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Updated on: 14 Oct 2021 11:15 AM IST
Bigg Boss Season 5 Telugu Episode Highlights on 12 10 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మంగళవారం ఎపిసోడ్ లో ఒకవైపు శన్ముఖ్ జస్వంత్ ఐన్ స్టీన్ లాజిక్ గురించి మాట్లాడుతూ ఇంట్లో ఎవరు ఎవరిని ఎందుకు నామినేట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదని, ఇంటిసభ్యులతో పాటు ప్రేక్షకుల నుండి సానుభూతి పొందటానికి శ్రీరామచంద్ర ప్రయత్నిస్తున్నాడని శన్ముఖ్, జెస్సీ మాట్లాడుకున్నారు.

ఇక శ్వేతావర్మ మాత్రం ఆర్జే కాజల్ తన గురించి అనవసరమైన కామెంట్స్ చేస్తుందని, ముందు ఒకలాగా.. వెనుక ఒకలాగా మాట్లాడుతుందని తన సహచరులకు చెప్తూ తన ఆవేశాన్ని వ్యక్తం చేసింది. సన్నీ మాత్రం నామినేషన్ గురించి పట్టించుకోకుండా తన సహచరులను అనుకరిస్తూ చేసిన కామెడీ ఇంటి సభ్యులను నవ్వించాడు. ఈ వారం బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులను నాలుగు టీమ్స్ గా విభజించి.., సిరి హనుమంత్, ఆర్జే కాజల్ ని సంచాలక్ గా ఎంపిక చేస్తాడు.

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా టీం సభ్యుల వివరాలు:

సన్నీ, మానస్, ఆనీ మాస్టర్

శన్ముఖ్ జస్వంత్, జెస్సీ, ప్రియాంక సింగ్

రవి, లోబో, శ్వేతవర్మ

ప్రియ, శ్రీరామచంద్ర, విశ్వా

బిగ్ బాస్ పంపే కాటన్ ని తీసుకొని ఎవరైతే మంచి క్వాలిటీతో ఎక్కువ బొమ్మలు తయారు చేస్తారో ఆ టీం కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. అయితే ఆటలో రెండు రౌండ్లు ముగిసే సమయానికి సన్నీ, మానస్, ఆనీ మాస్టర్ టీం ముందంజలో ఉంది. ఇదే సమయంలో అనీ మాస్టర్ సంచాలక్ గా ఉన్న సిరి హనుమంత్ తో గొడవకి దిగుతుంది. సిరి హనుమంత్ శన్ముఖ్ టీంకి సపోర్ట్ చేస్తుందని పరోక్షంగా అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఆనీ మాస్టర్ మాట్లాడుతున్న సమయంలో అనవసరంగా మాటలు వదలోద్దు అని చెప్పిన ఆర్జే కాజల్ పై ఆనీ మాస్టర్ ఫైర్ అవుతుంది. ఆ తరువాత సన్నీ, మానస్ కి నాకు ముందే ఆర్జే కాజల్ పాము అని తెలుసని ఆనీ మాస్టర్ అనడంతో ఆమెని శాంతపరచడానికి సన్నీ కామెడీగా ఏ పాము మాస్టర్ అని అడగడం ప్రేక్షకులను నవ్వులు తెప్పించింది.

ఇక రవి టీం తీసుకున్న కాటన్ లో ఒక చీటి రావడం, అందులో ఏదైనా ఒక టీంలో ఉన్న మొత్తం బొమ్మలను రవి టీంకి తీసుకునే అవకాశం కల్పిస్తాడు బిగ్ బాస్. గురువారం జరగనున్న ఎపిసోడ్ తో ఈ వారం ఏ సభ్యుడు ఇంటి కెప్టెన్ గా ఎంపిక అవుతాడో తెలియనుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story