Bigg Boss 5 Highlights: కెప్టెన్సీ పోటీదారులుగా శన్ముఖ్, సిరి, శ్రీరామచంద్ర

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Published on: 27 Oct 2021 11:25 AM IST
Bigg Boss Season 5 Telugu Tuesday Episode Highlights 26th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మంగళవారం ఎపిసోడ్ ఇంటి సభ్యుల సరదా సంభాషణతో పాటు టాస్క్ లో పోటీతో ముగిసింది. అభయ హస్తం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ పూర్తిగా లాక్ డౌన్ లో ఉండటంతో పాటు 5 జంటలకు మాత్రమే ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో ఆ టాస్క్ లలో ఎవరు పాల్గొనాలని కెప్టెన్ విజే సన్నీ ఇచ్చిన సలహాతో ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో మొదటగా గత ఏడు వారాలుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక కాని శన్ముఖ్ జస్వంత్, లోబోలను మొదటి టాస్క్ కోసం ఎంపిక చేసుకున్నారు.

ఆ టాస్క్ లో భాగంగా టబ్ లో ఉన్న పేడలో నుండి ముత్యాలను బిగ్ బాస్ ఇచ్చిన సమయంలోపు ఎవరైతే ఎక్కువగా బయటికి తీస్తారో వారు ఈవారం కెప్టన్సీ పోటీదారుడిగా ఎంపిక అవుతారని బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో ఆ టాస్క్ లో పాల్గొన్న శన్ముఖ్ జస్వంత్, లోబోలలో శన్ముఖ్ 101 ముత్యాలను తీసి టాస్క్ లో విజేతగా నిలుచి మొదటి కెప్టెన్ కంటెన్డర్ గా నిలిచాడు. సోమవారం నామినేషన్ లో భాగంగా తన కోసం లెటర్ ని త్యాగం చేసిన సిరి హనుమంత్ కోసం విశ్వా కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.

ఇక ఆ తరువాతి టాస్క్ లో సిరి హనుమంత్, రవి పాల్గొనగా అందులో సిరి హనుమంత్ గెలిచి రెండవ కెప్టెన్సీ కంటెన్డర్ గా నిలిచి ఇంట్లోకి వెళ్ళడానికి అనుమతి పొందింది. ఇక మూడవ టాస్క్ లో భాగంగా మానస్, శ్రీరామచంద్రలు పాల్గొనడం అందులో శ్రీరామచంద్ర గెలిచి మూడవ కెప్టెన్సీ కంటెన్డర్ గా ఎంపిక కావడం జరిగింది.

ఇక మంగళవారం ఇంట్లోకి వెళ్ళడానికి టాస్క్ లో గెలిచిన ముగ్గురు ఇంటి సభ్యులకు అవకాశం రాగా బుధవారం ఎపిసోడ్ లో జెస్సీ మొదటగా తాను కెప్టెన్సీ టాస్క్ ను వదులుకోనని మాట్లాడటం ఆ తరువాత ఆనీ మాస్టర్ కెప్టెన్సీ టాస్క్ నుండి నేను తప్పుకుంటానని అనడం ఈరోజు ఎపిసోడ్ లో చూడనున్నాము.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story