BB5 Highlights: మాటల్లో తప్ప ఆటలో కనిపించని ప్రియ ఆవేశం..!!

* బిగ్ బాస్ 5 తెలుగు మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Published on: 20 Oct 2021 10:57 AM IST
Bigg Boss Season 5 Telugu Tuesday Episode Highlights 19th October 2021 | Bigg Boss 5 Updates
X

బిగ్ బాస్ సీజన్ 5 (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సోమవారం నామినేషన్ ప్రక్రియ ముగియడంతో మంగళవారం ఎపిసోడ్ లో సన్నీ ఎవరిని ఎందుకు నామినేట్ చేశాడో అందుకు గల కారణాలను మానస్ తో పాటు రవికి కూడా అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఆ తరువాత బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బంగారు కోడిపెట్ట గేమ్ లో ఇంటి సభ్యులు ఎవరైతే ఎక్కువ కోడిగుడ్లు సేకరిస్తారో వారు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని బిగ్ బాస్ నియమాన్ని పెడుతాడు.

ఇక ఈ గేమ్ లో కొందరు కష్టపడి కోడిగుడ్లు సేకరిస్తే.. మరికొందరు ఇంటి సభ్యుల దగ్గర దొంగిలించి కోడిగుడ్లు సేకరించారు. విజే సన్నీ దగ్గర నుండి కోడిగుడ్లు దొంగిలించిన ప్రియ అతన్ని పలుమార్లు తన మాటలతో రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన విజే సన్నీ మాత్రం ఓపికతో ఉన్నాడు. ఇక శన్ముఖ్ జస్వంత్.. సిరి హనుమంత్ టాస్క్ లో శ్రీరామచంద్రతో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక అతడి బాధని జెస్సీకి చెప్పుకోవడం జరిగింది.

మరోపక్క మానస్ ని ప్రియ పిలిచి తన దగ్గర ఉన్న కోడిగుడ్లని ఇవ్వడం.. అవి మానస్, ప్రియాంక సింగ్ లు పంచుకోవడం జరిగింది. మొదటి రౌండ్ పూర్తయే సమయానికి ప్రియ, ప్రియాంక సింగ్ లు అతి తక్కువ కోడి గుడ్లతో చివరి స్థానంలో ఉండగా.., మానస్, సన్నీలు టాప్ లో నిలుస్తారు. ప్రియాంక సింగ్, మానస్ మధ్య సంభాషణ.., ఆ తరువాత ప్రియ, ప్రియాంక సింగ్ లు కాజల్ అవసరమైన దానికంటే అతిగా ప్రవర్తిస్తుందని మాట్లాడుకుంటారు.ఆ తరువాత మానస్.. సన్నీతో మాట్లాడుతూ నీతో నాకు ఏళ్ళ తరబడి స్నేహం లేకున్నా ఈ మూడు వారాలు మనం ఒకే దగ్గర ఉన్నాం.. నిన్ను ఎవరైనా ఏమంటే నాకు బాధ అనిపిస్తుందని అంటూ మానస్ కంటతడి పెట్టుకోగా సన్నీ అతడిని ఓదార్చుతాడు.

ఇక ఈరోజు ఎపిసోడ్ లో సన్నీ, ప్రియ మధ్య మాటల యుద్ధం జరగనున్నట్లు ప్రోమో ద్వారా అర్ధమవుతుంది. సన్నీ తప్పులేకుండా అనుకోకుండా జరిగిన ఒక చిన్న విషయానికి ప్రియ మాట్లాడిన మాటలు అటు ఇంటి సభ్యులకే కాకుండా ప్రేక్షకులకు నచ్చలేదు. ఇన్ని రోజుల వరకూ ఎంతో సంయమనంతో ఓర్పుతో ఉన్న సన్నీకి అంతగా కోపం కావడానికి ప్రియ ఎలాంటి మాటలు మాట్లాడిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రియ విషయానికొస్తే లహరి నామినేషన్ సమయంలో ఆమె గురించి అగౌరవంగా మాట్లాడటం, కొన్ని సందర్భాల్లో ఇంటి సభ్యుల గురించి వెతకరంగా మాట్లాడటం, నిన్నకాక మొన్న కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ లను ఏం పీకుతున్నారనడం, నేడు మరోసారి నోరుజారి మాట్లాడటంతో ప్రియ మాటలను ఆమె చేష్టలను ప్రేక్షకులు గమనిస్తూనే ఉన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story