BB5 Highlights: ఆటలో గెలిచి ఆనీ.. మనసు గెలిచి మానస్ నామినేషన్స్ నుండి సేఫ్

* బిగ్ బాస్ సీజన్ 5 మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Published on: 3 Nov 2021 12:02 PM IST
Bigg Boss Season 5 Telugu Tuesday Episode Highlights 02nd November 2021 | Bigg Boss 5 Updates
X

BB5 Highlights: ఆటలో గెలిచి ఆనీ.. మనసు గెలిచి మానస్ నామినేషన్స్ నుండి సేఫ్ (ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Highlights: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 మంగళవారం ఎపిసోడ్ లో భాగంగా ఇప్పటికే తొమ్మిదో వారం నామినేట్ అయిన ఇంటి సభ్యులకు బిగ్ బాస్ నామినేషన్ నుండి బయటపడటానికి మరొక అవకాశంగా "జీవితమే ఒక ఆట" టాస్క్ ని ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు ఒక రూమ్ లో ఇంటి సభ్యుల ఫోటోలతో ఉన్న బ్యాగ్ లను తీసుకొని సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి.. చివరగా ఇంటి సభ్యుల్లో ఎవరైతే సేఫ్ జోన్ కి చేరుతారో వారితో పాటు వారి వద్ద ఎవరి ఫోటో ఉన్న బ్యాగ్ ఉంటుందో వారు ఇద్దరూ డేంజర్ జోన్ లోకి వెళుతారు. ఇక సేఫ్ జోన్ లో ఉన్న ఇంటి సభ్యులు ఆ ఇద్దరిలో ఎవరికీ ఇమ్మ్యూనిటీ చెప్పడం జరిగింది.

మొదట ఈ టాస్క్ లో శ్రీరామచంద్ర, కాజల్ డేంజర్ జోన్ లోకి రాగా అందులో శ్రీరామచంద్ర సేవ్ అయ్యాడు. రెండో రౌండ్ లో విజే సన్నీ, జెస్సి లలో జెస్సి సేవ్ అయ్యాడు.. మూడో రౌండ్ లో జెస్సి, సిరి హనుమంత్ లలో సిరి హనుమంత్ సేవ్ అయ్యింది. నాలుగో రౌండ్ లో శ్రీరామచంద్ర, విశ్వలలో శ్రీరామచంద్ర సేవ్ అయ్యాడు. వీరిద్దరి మధ్య సేవ్ చేయడానికి జరిగిన ఓటింగ్ లో మానస్, రవి ఇద్దరు శ్రీరామచంద్రకి ఓటు చేయడంతో పాటు వారు చెప్పిన కారణాలు అస్సలు నచ్చలేదని విశ్వ సన్నీతో మాట్లాడాడు. ఆరో రౌండ్ సమయంలో ఇంటి సభ్యులను సన్నీ ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా అనుకరిస్తూ ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులను నవ్వించాడు.

ఇక ఆరో రౌండ్ లో మానస్, రవిలలో మానస్ సేవ్ అవగా.., ఏడో రౌండ్ లో ఆనీ మాస్టర్, మానస్ లలో ఆని మాస్టర్ సేవ్ అయ్యింది. దీంతో చివరగా మిగిలిన శ్రీరామచంద్ర, ఆనీ మాస్టర్ లో మెజారిటీ ఇంటి సభ్యులు ఆని మాస్టర్ కి ఓటు చేయడంతో ఈవారం ఇమ్మ్యూనిటీతో నామినేషన్ నుండి బయటపడటమే కాకుండా.. అంతకు ముందు హోస్ట్ నాగార్జున ఇచ్చిన పవర్ షీల్డ్ తో ఈవారం ఇంటి సభ్యుల్లో మరొక వ్యక్తిని సేవ్ చేసే అవకాశం ఉందని చెప్పడంతో ఆ పవర్ ని ఉపయోగించి మానస్ ని ఈ వారం నామినేషన్ నుండి ఆని మాస్టర్ సేవ్ చేస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story