BB5 Promo: బిగ్ బాస్ ఇప్పుడే అయిపోలేదంటూ శ్రీరామ్, జెస్సీలపై సన్నీ ఫైర్

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గురువారం ప్రోమో విడుదల

Sandeep Reddy
Published on: 28 Oct 2021 4:18 PM IST
Bigg Boss Season 5 Telugu Thursday Promo Released 28th October 2021 | Bigg Boss 5 Updates
X

BB5 Promo: బిగ్ బాస్ ఇప్పుడే అయిపోలేదంటూ శ్రీరామచంద్ర, జెస్సీలపై సన్నీ ఫైర్(ఫోటో: స్టార్ మా)

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గురువారం ప్రోమో తాజాగా విడుదలైంది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఎంపిక అయిన ఆరుగురు ఇంటి సభ్యులు విజే జెస్సీ, శ్రీరామచంద్ర, ఆనీ మాస్టర్, శన్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హనుమంత్ లకు బిగ్ బాస్ "వేటాడు వెంటాడు" అనే టాస్క్ లో థర్మకోల్ బ్యాగ్స్ ఇచ్చి వాటిని చివరి వరకు కాపాడుకోవాలని చెప్పడం జరిగింది. ఈ టాస్క్ లో విజే సన్నీ - శ్రీరామచంద్ర మధ్య గేమ్ లో భాగంగా తోపులాటతో ఇద్దరు ఫైనల్ టాస్క్ లో కెప్టెన్సీ పోటీ నుండి నిష్క్రమించినట్టు తెలుస్తుంది.

అదే సమయంలో విజే జెస్సీ, శ్రీరామచంద్ర మధ్య మాట మాట పెరిగడంతో ఈ ఒక్క టాస్క్ తో బిగ్ బాస్ సీజన్ 5 అయిపోలేదంటూ అటు శ్రీరామచంద్రపైనే కాకుండా టాస్క్ కి సంచాలక్ గా వ్యవహరిస్తున్న జెస్సీపై కూడా విజే సన్నీ ఫైర్ అవుతాడు. ఈ టాస్క్ లో జెస్సీ నిర్ణయంతో మానస్ కూడా టాస్క్ నుండి వైదొలగడంతో చివరికి సిరి హనుమంత్, శన్ముఖ్ జస్వంత్, ఆనీ మాస్టర్ లు మిగిలిపోవడం ప్రోమోలో చూడవచ్చు.

ఇక ఎలాగూ శన్ముఖ్ జస్వంత్ కి ఒకసారి కెప్టెన్ అయిన సిరి హనుమంత్ సపోర్ట్ చేసే అవకాశం ఉండటంతో పాటు మిగిలిన కెప్టెన్సీ పోటీలో ఉన్న ఆనీ మాస్టర్ బ్యాగ్ పై ఇద్దరు కలిసి అటాక్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సంచాలక్ గా ఉన్న జెస్సీ పోటీదారులలో కొందరికి కావాలనే సపోర్ట్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాడని విజే సన్నీ ఫైర్ అవడం తాజా ప్రోమోలో చూడవచ్చు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story