BB5 Latest Promo: నమ్మినందుకు నన్ను ఎదవని చేశారని ఏడ్చేసిన శన్ముఖ్ జస్వంత్

BB5 Latest Promo: నమ్మినందుకు నన్ను ఎదవని చేశారని ఏడ్చేసిన శన్ముఖ్ జస్వంత్
* బిగ్ బాస్ సీజన్ 5 గురువారం ఎపిసోడ్ ప్రోమో విడుదల
BB5 Latest Promo: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు గురువారం ప్రోమో తాజాగా విడుదలైంది. అందరూ అనుకున్నట్టుగానే బుధవారం జరిగిన ఎపిసోడ్ సీక్రెట్ టాస్క్ లో భాగంగా జెస్సీ, సిరి హనుమంత్ కలిసి శన్ముఖ్ జస్వంత్ వద్ద ఉన్న అన్ని గుడ్లను ఎందుకు తీసుకున్నారో అసలు విషయం తెలిసాక శన్ముఖ్ జస్వంత్ తనని ఇద్దరు కలిసి ఎదవని చేశారని బాధపడటం తాజా ప్రోమోలో చూడవచ్చు. ఫ్రెండ్ అంటూనే ఇలా చేయడం తనకు నచ్చలేదని జెస్సీ, సిరిపై కోపంతో తనలో తానే బాధపడుతూ శన్ముఖ్ జస్వంత్ కంటతడి పెట్టుకుంటాడు.
శన్ముఖ్ అలా మాట్లాడటం, బాధపడటం చూసి సిరి హనుమంత్ కూడా కన్నీరు పెట్టుకోవడం ప్రోమోలో చూడొచ్చు. మరోపక్క లోబో సీక్రెట్ రూమ్ నుండి బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం గురువారం ఎపిసోడ్ లో చూడనున్నాము. ఇప్పటివరకు సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాక ఎవరికీ సపోర్ట్ చేస్తాడో, ఎవరితో ఎలా ప్రవర్తిస్తాడోనని ప్రస్తుతం బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సీక్రెట్ రూమ్ లో కూర్చొని ఇంటి సభ్యులు ఒక వ్యక్తికి ముందు, వెనుక ఏం మాట్లాడుతున్నారు.., ఎలా మాట్లాడుతున్నారో ఒక సామాన్య ప్రేక్షకుడిగా చూసిన లోబో ఇకపై అతను తీసుకునే ప్రతి నిర్ణయం అటు లోబో జర్నీపైనే కాకుండా ఇంటి సభ్యుల బిగ్ బాస్ ప్రయాణంపై ఆధారపడి ఉంటుందనే చెప్పాలి. ఇప్పటి వరకు సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో..నామినేషన్, కెప్టెన్సీ టాస్క్ లలో సన్నీ, విశ్వా, రవిలకు సపోర్ట్ చేసినట్టుగా చూశాము. మరి ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు పోటీదారులుగా నిలుస్తారో.. ఎవరు కెప్టెన్ గా ఎంపిక అవుతారో చూడాల్సిందే..!!
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMTT-Hub 2.0: టీ హబ్ నేషనల్ రోల్ మోడల్- సీఎం కేసీఆర్
28 Jun 2022 2:30 PM GMTప్రధాని మోడీతో వేదిక పంచుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి..
28 Jun 2022 2:18 PM GMT