Bigg Boss 5 Highlights: నా కోసమే ఆడుతా..ఆటలో తగ్గేదేలే అంటున్న ప్రియాంక సింగ్

Sandeep Reddy
Updated on: 6 Nov 2021 12:08 PM IST
Bigg Boss Season 5 Telugu Thursday Episode Highlights 04th  November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 Highlights: నా కోసమే ఆడుతా..ఆటలో తగ్గేదేలే అంటున్న ప్రియాంక సింగ్

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 గురువారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ ఇచ్చిన సూపర్ విలన్స్ వర్సెస్ సూపర్ హీరోస్ టాస్క్ లో భాగంగా ప్రియాంక సింగ్, ఆని మాస్టర్ లు పాల్గొన్నారు.. అంతకు ముందు సూపర్ విలన్స్ టీం నుండి రవి, సూపర్ హీరోస్ నుండి శ్రీరామచంద్ర ఇంటి సభ్యులు ఇచ్చిన అన్ని ఛాలెంజ్ లను విజయవంతంగా పూర్తి చేసి కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయిన సంగతి తెలిసిందే.

గుడ్డు అంటే ఇష్టంలేని ప్రియాంక సింగ్ ప‌చ్చి గుడ్డు ర‌సాన్ని తన టీం సభ్యులు ఎంకరేజ్ చేయడంతో తాగేసింది. ఆ తరువాత పేడ‌ నీటితో స్నానం చేయడంతో పాటు రకరకాల ఐటమ్స్ కలిపిన జ్యూస్‌ను తాగింది. ఉల్లిపాయ న‌చ్చ‌క‌పోయినా కెప్టెన్సీ టాస్క్ కోసం క‌ర‌క‌రా న‌మిలేసింది.

ఆ తరువాత ప్రియాంక సింగ్ కు జుట్టును క‌ట్ చేసుకోవాలని సిరి హనుమంత్ క‌త్తెర ఇచ్చింది. అప్పుడు హెయిర్ తనకు పెంచుకోవడం చిన్నప్పటి నుండి ఇష్టమని అంతేకాకుండా ఈ జుట్టు క్యాన్స‌ర్ పేషెంట్ల కోసం పెంచుతున్నాన‌ని అయిన కూడా తాను హెయిర్‌ క‌ట్ చేసుకుంటానని చెప్పడంతో సిరి హనుమంత్ వద్దులే మేము మరి అంత రాక్షసంగా ఉండలేము అని అంటుంది.

విలన్ టీమ్ ఇచ్చిన గుడ్డు‌, పెయింట్ తో కలిపిన రసాన్ని ముఖానికి పూసుకుంది. ఇక తనకిచ్చిన అన్ని ఛాలెంజ్ లను విజ‌య‌వంతంగా పూర్తి చేసి కెప్టెన్సీ పోటీలో నిలిచింది. ఇక ఈ మధ్యలో శన్ముఖ్ జస్వంత్ - సిరి హనుమంత్ లు ఇద్దరు గొడవపడటం ఆ తరువాత శన్ముఖ్ సిరికి సారీ చెప్పి 10 గుంజీలు తీయడంతో పాటు ఇంటి సభ్యులకు వినబడేలా సారీ చెప్పడంతో సిరి కోపం తగ్గి శన్ముఖ్ ని హత్తుకుంటుంది. ఆ వెంటనే జెస్సీ, విజే సన్నీ వచ్చి ఈ ఇద్దరిని హగ్ చేసుకుంటారు.

ప్రియాంక సింగ్ తరువాత సూపర్ విల‌న్స్ టీమ్‌లో నుంచి ఆనీ మాస్టర్ ని టార్గెట్ చేసి హీరోస్ టీం సభ్యులు ఆమెకి మూడు డ్రింకులు ఇచ్చారు. పచ్చిమిర్చిని తినిపించడంతో పాటు పెయింట్ పూయడం, పేడతో క‌లిపిన‌ చల్లటి నీటితో స్నానం చేయించారు హీరోస్ టీం. ఆనీ మాస్టర్ కూడా సూపర్ హీరోస్ ఇచ్చిన ఆని ఛాలెంజ్ లను విజయవంతంగా పూర్తి చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story